ETV Bharat / entertainment

దీపావళి స్పెషల్​ - కొత్త సినిమా/సిరీస్​లతో ముస్తాబైన ఓటీటీలు - ఆ మూవీ వెరీ స్పెషల్

దీపావళికి మరిన్ని కాంతులు జోడించేందుకు కొత్త సినిమాలు, సిరీస్​లతో ముస్తాబైన ఓటీటీలు!

Deepavali OTT Movies
Deepavali OTT Movies (source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Deepavali OTT Movies : దీపావళి సందర్భంగా పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్​లు కొత్త సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. పండుగ రోజు ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చొని ​ ఎంజాయ్ చేసేందుకు పలు బడా సినిమాలు, చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.

ఆహా ఓటీటీలో

ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన 'కలి' సినిమా అక్టోబరు 31న ఆహా ప్లాట్ ఫాంలోకి రానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ అయిన ఈ కథను కలి పురుషుడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. శివ శేషు దర్శకత్వం వహించగా రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది.

ఆహా ఓటీటీలో గత సంవత్సరం వచ్చిన అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ కొనసాగింపే అర్థమైందా అరుణ్ కుమార్ 2. అక్టోబరు 31 నుంచి స్ట్రీమింగ్ కానుండగా సేమ్ టూ సేమ్ తొలి పార్ట్‌లో మాదిరిగానే ఈ సిరిస్‌లోనూ అమ్మాయిలు హీరోతో ఆడేసుకుంటుంటారు. ఈ కామెడీ ఎమోషనల్ డ్రామాలో అరుణ్ కుమార్ పాత్రలో సిద్దూ పవన్ నటిస్తుండగా తేజస్వీ మడివాడ, అనన్య, సిరి రాశి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Zee5 ఓటీటీలో

Zee5 ఒరిజినల్ సిరీస్ అయిన మిథ్య తొలి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ను మిథ్య: ది డార్కర్ చాప్టర్ పేరుతో రూపొందించారు. హ్యుమా ఖురేషి, అవంతిక దస్సాని ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సిరీస్‌కు కపిల్ శర్మ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్​.

ఈటీవీ విన్ ఓటీటీలో

ఈటీవీలో ప్రసారమవుతోన్న 'నా ఉచ్ఛ్వాసం కవనం' అనే కార్యక్రమాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ అతిథిగా విచ్చేసి సిరివెన్నెల అంటే తనకెంత ఇష్టమో పాటల ద్వారా తెలియజేసి ముచ్చటించారు. ఇక దీని పార్ట్ 2ను దీపావళి సందర్భంగా ఈటీవీ విన్ యాప్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నవంబరు 3 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.

కన్నడ రొమాంటిక్ చిత్రం లవ్ మాక్ టైల్ 2. ఈ సినిమా దర్శకడు, రచయిత, హీరో ఒక్కరే. ఆయనే డార్లింగ్ కృష్ణ. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్ ఆయన రియల్ లైఫ్​ భార్యనే. పైగా ఆమె సహ నిర్మాత కూడా. 2022లో విడుదలైన ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుని ఈటీవీ విన్ యాప్‌లో అక్టోబరు 31 నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

నెట్​ఫ్లిక్స్​ ఓటీటీలో

పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయిన తంగలాన్ సినిమాలో చియాన్ విక్రమ్ నటించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ నిర్మాణంలో పా రంజిత్ దర్శకత్వం వహించారు. విక్రమ్ తో పాటుగా పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు. అక్టోబరు 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇవే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో మరికొన్ని డిప్లొమాట్2, టైమ్ కట్, ది మాన్ హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్టులు స్ట్రీమింగ్ కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో

అమెజాన్ ప్రైమ్‌లో జోకర్ 2 అనే హాలీవుడ్ సినిమా సిద్ధమైంది. ఇంకా నోక్టర్నో (ఫిలిప్పీన్ హారర్ సినిమా), అజ్రేల్ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ చిత్రం), ది బ్లూ కేవ్ (టర్కిష్ చిత్రం), అపోకలిప్స్ జడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ (ఇంగ్లీష్ సినిమా) అక్టోబర్ 31నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

డిస్నీ హాట్ స్టార్​ ఓటీటీలో

డిస్నీ+ హాట్ స్టార్‌లో విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (సిరీస్), కిష్కింద కాండ (మలయాళం), లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా) స్ట్రీమింగ్ కానున్నాయి.

జియో సినిమా ఓటీటీ - ది వైల్డ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ యాక్షన్ మూవీ) - అక్టోబర్ 31

పైన చెప్పిన సినిమాలన్నింటీలో చియాన్ విక్రమ్ తంగలాన్​ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తోంది. పైగా అదే పెద్ద సినిమా.

అక్కినేని హీరోతో జాన్వీకపూర్​! - ఏ సినిమా కోసం అంటే?

'లక్కీ భాస్కర్‌' రివ్యూ - సినిమాకే అది హైలైట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.