Celebrities Who Live In Rental Houses : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజాగా తన ఇంటిని యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు అద్దెకు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ముంబయిలోని సీ ఫేసింగ్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌కు వరుణ్ భారీ మొత్తంలో అద్దె చెల్లించి ఉండేందుకు నిశ్చయించుకున్నారట. దీంతో అందరూ ఒక్కసారిగా షాకరయ్యారు. ఎంటి సెలబ్రిటీలు కూడా అద్దె ఇంట్లో ఉంటారా అంటూ పలువురు నెట్టింట కామెంట్లు పెట్టడం మొదలెట్టారు. అయితే ఇప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు రెంటెడ్ హౌస్‌లో నివసిస్తున్నారు. మరీ వారవరో ఓ లుక్కేద్దామా.
ఇమ్రాన్ ఖాన్ : మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అద్దె ఇంట్లో నివసిస్తున్నారట. త అయిన లేఖ వాషింగ్టన్‌తో కలిసి కరణ్ జోహార్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బాంద్రా కార్టర్ రోడ్‌లోని మూడంతస్థుల బిల్డింగ్‌కు నెలకు రూ.9లక్షలు చొప్పున మూడేళ్లకు అద్దెకు తీసుకున్నాడు. ఈ నిమిత్తం రూ.27 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాడట.
కార్తిక్ ఆర్యన్ : తన కో స్టార్ షాహిద్ కపూర్‌కు చెందిన జుహూ అపార్ట్‌మెంట్‌లోని ఒక ప్లాట్‌లో రెంట్‌కు ఉంటున్నారట బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్. దాని కోసం ఆయన నెలకు రూ.7.5లక్షల అద్దె చెల్లిస్తున్నారట. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.45లక్షలు కూడా చెల్లించారట.
కృతి సనన్ : జుహులోని అమితాబ్ బచ్చన్‌కు చెందిన డూప్లెక్స్ హోమ్‌ను రెంట్‌కు తీసుకున్నారు హిందీ నటి కృతి. రూ.60లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేసి, నెలకు రూ.10లక్షల అద్దె చెల్లిస్తున్నారట.
అదితీ రావు హైదరి : అదితి కూడా ముంబయిలో అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. బీటౌన్ బ్యూటీ మలైకా అరోరాకు చెందిన ఓ ఫ్లాట్‌ను ఆమె రెంట్‌కు తీసుకున్నారట. దీనికిగాను ఆమె నెలకు రూ.2.31లక్షల అద్దె చెల్లిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా మూడేళ్లకు గానూ రూ.20 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశారట.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2021లోనే తన కో స్టార్ ప్రియాంక చోప్రాకు చెందిన రూ.7కోట్ల ఇంటికి షిఫ్ట్ అయ్యారు. 'కర్మయోగ్' అనే పేరుగల ఈ ఖరీదైన బిల్డింగులో అద్దెకు ఉండేందుకు ఆమె నెలకు సుమారు రూ.6.78లక్షల అద్దె చెల్లిస్తున్నారని సమాచారం.
రిస్క్ చేస్తున్న మీడియం రేంజ్ హీరోలు - ఎవరంటే? - Tollywood Tier 2 and 3 Heroes