Bollywood Star Charges Rs.1 Cr For 10 Min : బాలీవుడ్‌కు చెందిన ఈ వ్యక్తి స్టార్ హీరో కాదు. కానీ, ప్రైవేట్ ఐలాండ్, సపరేట్ జెట్ ఫ్లైట్‌లతో లగ్జరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. చిన్నప్పటి తన అభిరుచితో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులరయ్యారు. ఎంతో మందికి ఫేవరట్ స్టార్‌గా మారారు. ఇంతకీ ఆయనెవరా అని అనుకుంటున్నారా? తన గాత్రంతో ఫ్యాన్స్‌ను షేక్ చేసే మికా సింగ్. గురుద్వారాలో కీర్తనలు పాడే దగ్గర నుంచి స్టార్ సింగర్‌గా ఈయన జర్నీ ఎలా సాగిందంటే?
'దిల్ మే బజీ గిటార్' సాంగ్‌తో పాపులర్ అయ్యారు గాయకుడు మికా సింగ్. 'జబ్ వీ మెట్' సినిమాలోని 'మౌజా హీ మౌజా', 'బాములైజా', 'దిల్ బోలె హడిప్పాల'తో ఈయన మరింత క్రేజ్‌ను సంపాదించుకున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే బాలీవుడ్‌కు ఛార్ట్ బస్టర్లు అందించిన మికా, ఆ తర్వాత 'సుబహ్ హోనే నా దే', 'లాంగ్ డ్రైవ్', 'పుంగీ' లాంటి సాంగ్స్‌తో రికార్డు సృష్టించారు. ఇవే కాకుండా సోలోగా పెర్ఫామ్ చేసిన వాటిలో "సావన్ మే లగ్ గయీ ఆగ్" లాంటి హిట్ సాంగ్‌తో బీభత్సమైన క్రేజ్ దక్కించుకున్నారు.
పది నిమిషాలకు కోటిన్నర:
ఇక మికా క్రేజ్ చూసి అంబానీ ఫ్యామిలీ ఆయనకు స్పెషల్ ఇన్విటేషన్ అందించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థ వేడుకలో పెర్ఫామ్ చేశారు. అందుకుగానూ మికా పది నిమిషాలకు రూ.కోటిన్నర చొప్పున వసూలు చేశారని సమాచారం.
ఇదిలా ఉండగా, ఆయన ఒక్కో పాటకు రూ.20 నుంచి రూ.22లక్షల వరకూ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తారట. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ స్టార్ సింగర్ ప్రస్తుత నికర విలువ సుమారు రూ.66 కోట్లు ఉంటుందని సమాచారం. ఈయన వద్దనున్న కార్ల కలెక్షన్లతో పాటు ఓ ప్రైవేట్ ఐలాండ్, ఏడు బోట్లు, 10 గుర్రాలతో విలాసవంతమైన లైఫ్‌ను గడుపుతున్నారని టాక్. వేకేషన్‌కి వెళ్లేందుకు ఓ ప్రైవేట్ జెట్ కూడా కొనుగోలు చేశారట.