AR Raham Lal Salaam : తన మ్యూజిక్‌తో ఎన్నో పాటలకు చక్కటి బాణీలను కట్టిన మ్యూజికల్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించారు. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)ను ఉపయోగించి మరణించిన ఇద్దరు గాయకుల గాత్రానికి ప్రాణం పోశారు. తన మ్యాజిక్‌తో ఆ గాత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న 'లాల్ సలామ్' సినిమాలో 'తిమిరి ఎలుద' అనే పాట కోసం దివంగత సింగర్స్ బాంబ భక్య, షాహుల్ హమీద్‌ల వాయిన్సు ఉపయోగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"మేము ఆ ఇద్దరి వాయిస్ అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పర్మిషన్ తీసుకున్నాము. అంతే కాకుండా అలా ఉపయోగించుకున్నందుకు ఆ కుటుంబాలకు పారితోషకాన్ని కూడా అందించాము. సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే అది మనకు ముప్పు కలిగించదు. #Respect Nostalagia " అంటూ రెహమాన్ ట్విట్టర్లో వెల్లడించారు.
-
We took permission from their families and sent deserving remuneration for using their voice algorithms ..technology is not a threat and a nuisance if we use it right…#respect #nostalgia 🙏 https://t.co/X2TpRoGT3l
— A.R.Rahman (@arrahman) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">We took permission from their families and sent deserving remuneration for using their voice algorithms ..technology is not a threat and a nuisance if we use it right…#respect #nostalgia 🙏 https://t.co/X2TpRoGT3l
— A.R.Rahman (@arrahman) January 29, 2024We took permission from their families and sent deserving remuneration for using their voice algorithms ..technology is not a threat and a nuisance if we use it right…#respect #nostalgia 🙏 https://t.co/X2TpRoGT3l
— A.R.Rahman (@arrahman) January 29, 2024
ఇది విన్న ఫ్యాన్స్ రెహమాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఏఐ ఉపయోగించి తమ ఫేవరట్ సింగర్స్ గాత్రాన్ని మరోసారి వినేలా చేసినందుకు రెహమాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాంబ భక్య 2022లో మరణించగా, షాహుల్ 1997లో తుది శ్వాస విడిచారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Lal Salaam Cast : ఇక 'లాల్ సలామ్' సినిమా విషయానికి వస్తే - క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ విష్ణు విశాల్స, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ మూవీ రూపందింది. రజనీ కుమార్తె ఐశ్వర్య డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీలో రజనీ మొయినుద్దీన్ భాయ్ అనే రోల్లో కనిపించారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ జీవిత రాజశేఖర్, కోలీవుడ్ నటులు లివింగ్స్టన్, తంబిరామయ్య, సెంథిల్ కూడా కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఫిబ్రవరీ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.
తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు - రెహమాన్ పేరిట ఉన్న ఆ వీధి ఎక్కడుందంటే ?