ETV Bharat / entertainment

ఉపాసన తాతయ్య బయోపిక్​లో రామ్​చరణ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 10:01 AM IST

Apollo Ramchran Biopic : తన తాతయ్య బయోపిక్​లో మెగాపవర్ స్టార్​ రామ్​చరణ్ నటిస్తారా? అన్నప్రశ్నకు ఉపాసన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఆన్సర్​ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉపాసన తాతయ్య బయోపిక్​లో రామ్​చరణ్!
ఉపాసన తాతయ్య బయోపిక్​లో రామ్​చరణ్!

Apollo Ramchran Biopic : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకైతే ఎవరి బయోపిక్​లోనూ నటించలేదు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే, తాను స్పోర్ట్స్ పర్సన్ రోల్ చేయాలని ఉందంటూ ఆ మధ్య తన మనసులో మాటను బయట పెట్టారు. దీంతో టీమ్​ ఇండియా స్టార్ క్రికెటర్​ విరాట్ కోహ్లీ బయోపిక్ ఓకేనా అని అడగగా - ఛాన్స్​ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. అయితే తాజాగా రామ్​చరణ్ ఓ​ బయోపిక్​లో నటించడంపై ఉపాసన మాట్లాడారు. తన తాత బయోపిక్​లో రామ్​చరణ్​ నటిస్తారా? అన్న విషయంపై ఆమె సమాధానమిచ్చారు.

'ప్రతాప్ రెడ్డి'గా రామ్ చరణ్ : రామ్ చరణ్ సతీమణి, ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కామినేని కొణిదెల తాతయ్య ప్రతాప్ సి రెడ్డి. ఈయన గురించి చాలా మందికి తెలుసు. అపోలో హాస్పిటల్​ వ్యవస్థాపకుడాయన. దేశ విదేశాల్లో అపోలో సేవలను విస్తరించారు. హెల్త్ కేర్ రంగంలో అరుదైన ఖ్యాతి గడించారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఫిబ్రవరి 5న ఆయన పుట్టినరోజు.

తాతయ్య పుట్టినరోజు సందర్భంగా 'ది అపోలో స్టోరీ' పేరుతో ఉపాసన ఓ పుస్తకాన్ని లాంఛ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతాప్ సి రెడ్డి కుటుంబ సభ్యులు కొందరు హాజరై సందడి చేశారు. అయితే ఈ పుస్తకావిష్కరణలో ఉపాసనకు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే 'మీ తాతయ్య జీవితంపై బయోపిక్ ఏమైనా తీసే ఆలోచన ఉందా? సినిమా వస్తుందా?' అని అడగగా - 'భవిష్యత్తులో బయోపిక్ రావచ్చు' అని ఉపాసన పేర్కొన్నారు. 'ప్రతాప్ సి రెడ్డి పాత్రలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉంటుందా?' అని అడగగా - 'అది డైరెక్టర్​ విజన్​పై ఆధారపడి ఉంటుంది' అని ఉపాసన చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే - దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ డ్రమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్​ దాదాపు చివరి దశకు చేరుకుంది. దసరాకు రిలీజయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైంది. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఇది తెరకెక్కనుందని సమాచారం.

SSMB 29 - వారిని పక్కన పెట్టేసిన జక్కన్న!

కొత్త ప్రపంచంలోకి 'తెలుగు సినిమా'- అప్​కమింగ్ సినిమాలన్నీ ఆ జానర్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.