Allu arjun Pushpa 3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప 2'. ఇప్పుడీ సినిమా సిల్వర్ స్క్రీన్ సిరీస్‌గా మారేలా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు భాగాలతో ఆగకుండా ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి 'ది రూల్' పేరుతో రెండో భాగం తెరకెక్కుతుండగా 'ది రోర్' పేరుతో మూడో భాగాన్ని తీసుకొస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రాధమికంగా బన్నీ, సుక్కు, మైత్రి అధినేతలు చేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయ్యారట.
వినడానికి మూడో భాగం అంటే బాగానే ఉంది కానీ దీన్ని తెరకెక్కించాలంటే ముందుగా సెకండ్ పార్ట్ క్లిక్ అవ్వడం చాలా ముఖ్యం. నిజానికి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు, వాటికి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప'కి కూడా ముందుగానే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మూడో భాగం అన్నది కొత్తగా వచ్చిన ప్రచారం. ఆడియెన్స్‌కు ఓ భాగం నచ్చింది కదా అని వరసపెట్టి అవే తీసుకుంటూ పోయినా కూడా కాస్త బోర్ కొట్టే అవకాశాలు ఉంటాయి. తీసే విధానంలో కొత్తగా ఉంటేనే సక్సెస్ అవుతుంది.
పైగా సుకుమార్ గతంలోనే ఈ చిత్రాన్ని వెబ్ సిరీస్‌కు సరిపడా లెన్త్‌తో రాసుకున్నట్లు చెప్పారు. కథ అల్లు అర్జున్‌కు నచ్చడం వల్ల సినిమా నిడివికి తగ్గట్టు మార్చినట్లు అన్నారు. అయితే ఇప్పుడు తొలి భాగం హిట్ అవ్వడం, రెండో భాగం కోసం భారీగా హైప్ పెరగడం చూసి - మళ్లీ కథ నిడివి పెంచుకుంటూ పోతున్నారేమో. ఏదేమైనా దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో.
ఇకపోతే రెండో భాగంలో జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టు ఫైట్ ఓ రేంజ్లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య ఫైట్స్‌ను మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు పరిచయం కాని చాలా కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. దీని బట్టి పుష్పను టాలీవుడ్లో ఒక పవర్ ఫుల్ బ్రాండ్‌గా మార్చేందుకు సుక్కు సినిమాను గట్టిగానే చెక్కుతున్నారని అర్థమవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఒకప్పుడు స్టార్ హీరో షూస్ మోసిన అసిస్టెంట్ - ఇప్పుడు సినిమాకు రూ.100 కోట్లు తీసుకునే స్టార్!
నాగార్జున మూవీ కోసం అలియా భట్ తండ్రి హైడ్రామా - హీరోయిన్ను చంపేసి!