ETV Bharat / entertainment

రిలీజ్ కాకుండానే రికార్డు - రూ. 95 కోట్లకు అజిత్ మూవీ ఓటీటీ రైట్స్​! - Ajith Good Bad Ugly OTT - AJITH GOOD BAD UGLY OTT

Ajith Good Bad Ugly OTT Rights : తమిళ స్టార్ హీరో అజిత్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ధ్రిల్లర్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోయాయట. ఆ వివరాలు మీ కోసం.

Ajith Good Bad Ugly OTT Rights
Ajith Good Bad Ugly OTT Rights (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 10:26 AM IST

Ajith Good Bad Ugly OTT Rights : తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం వరుస షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలె ఆయన విడాముయర్చి అనే మూవీ షూటింగ్​లో యాక్టివ్​గా ఉండగా, ఇప్పుడు దాంతో పాటు మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న 'గుడ్​ బ్యాడ్ అగ్లీ' చిత్రీకరణలోనూ సందడి చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్​ను రివీల్​ చేసిన మేకర్స్ అందులో రిలీజ్ డేట్​ను ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు తెలిపారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్​ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్ ఏకంగా రూ.95 కోట్లకు కొనుగోలు చేసిందట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త విని అజిత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరగా టీజర్ విడుదల చేయండి అంటూ మూవీ టీమ్​ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా విషయానికి వస్తే, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ మూవీని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్​లో జరుగుతోంది.

మరోవైపు అజిత్ నటిస్తున్న విడాముయర్చి కూడా షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష నటిస్తున్నారు. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్​తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ డైరెక్టర్ మగిళ్‌ తిరుమేని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లైకా సుబాస్కరన్ తన సొంత బ్యానర్ అయిన​ లైకా ప్రొడక్షన్స్​పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

స్పెషల్ సర్​ప్రైజ్ - అజిత్​కు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన షాలిని - Kollywood Actor Ajith Birthday

అజిత్ కార్​ స్టంట్ వీడియో - క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్​! - Ajith Kumar Car Stunt

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.