ETV Bharat / entertainment

చిరుకు పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో - వచ్చే సంక్రాంతికి 7 సినిమాలు! - tollywood sankranthi 2025 movies

Ajith Good Bad And Ugly : మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంతో పోటీ పడేందుకు రెడీ అయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. తన కొత్త సినిమాను మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​లో చేసేందుకు సిద్ధమయ్యారు. సినిమా టైటిల్​ను కూడా అనౌన్స్ చేశారు. ఆ వివరాలు.

చిరుకు పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో - వచ్చే సంక్రాంతికి 7 సినిమాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 10:38 PM IST

Ajith Good Bad And Ugly : రెండు నెలల క్రితమే సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్ ముగిసింది. సంక్రాంతి రిలీజ్​ డేట్​ కోసం దాదాపు 8 సినిమాల వరకు పోటీ పడి చివరకు నాలుగు విడుదలై అందులో రెండు మాత్రమే విజయం సాధించాయి. హనుమాన్ పాన్ ఇండియా రేంజ్​లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా నా సామి రంగ తెలుగు వరకు మంచి సక్సెస్​ను అందుకుంది. అయితే ఈ ముగ్గుల పండగ సీజన్ ముగిసి రెండు నెలలు అయిందో లేదో అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్​ ఫైట్ కోసం ఇప్పటి నుంచే కర్ఛీఫ్​లు వేస్తున్నాయి ఆయా సినిమాలు. ఇప్పటికే అర డజనుకు పైగా చిత్రాలు రిలీజ్ డేట్​ను ఖరారు చేసుకునే పనిలో పడ్డాయి.

అయితే తాజాగా మరో చిత్రం కూడా ఈ పతకాల పండగ సీజన్ కోసం రిలీజ్ డేట్​ను కన్ఫామ్ చేసుకుంది. అయితే అది తెలుగు చిత్రం కాదండోయ్. తమిళ స్టార్ హీరో సినిమా. కానీ దీన్ని భారీ బడ్జెట్​తో నిర్మించేది మాత్రం మైత్రీ మూవీ మేకర్స్​ సంస్థ కావడం విశేషం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్​ను ఖరారు చేశారు. అధిక్ రవిచంద్రన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండవు. కానీ తెలుగులో మాత్రం గట్టి పోటీ నెలకొందనే చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడాల్సి వస్తుంది.

Tollywood Sankranthi 2025 Movies : ఇప్పటికే చిరు తన సోషియో ఫాంటసీ హై బడ్జెట్​ చిత్రం విశ్వంభరను 2025 పండగ బరిలో దించబోతున్నట్లు అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. శతమానం భవతి సీక్వెల్ కూడా అప్పుడే రాబోతుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్, వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబో మూవీ, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ చిత్రం, బాలకృష్ణ - బాబీ ఎన్​బీకే 109 చిత్రాలు కూడా ఈ పండక్కే వచ్చేందుకు ఫిక్స్​ అయినట్లు సమాచారం అందుతోంది. వీటిలో బాలయ్య ఎన్​బీకే 109 ఈ ఏడాదైనా రావొచ్చు.

అలా ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ సంక్రాంతి కోసమే ముస్తాబవుతున్నాయని తెలుస్తోంది. అంటే దాదాపు ఏడు సినిమాల వరకు ముగ్గుల పండక్కు రానున్నాయన మాట. మరి చివరి కొచ్చేసరికి ఈ సినిమాలన్నింటిలో ఎన్ని నిలబడతాయో? ఎన్ని తప్పుకుంటాయో చూడాలి?

బాలీవుడ్ వర్సెస్​ సౌత్ ఇండస్ట్రీ - ఐకాన్ స్టార్​ రియాక్షన్ ఇదే

ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన 'జాతి రత్నాలు' ఫరియా అబ్దుల్లా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.