ETV Bharat / education-and-career

వెస్ట్రన్​ రైల్వేలో 'స్పోర్ట్స్ కోటా' పోస్టులు​ - రాత పరీక్ష లేదు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Sports Quota Jobs

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 10:40 AM IST

Indian Railway Sports Quota Jobs 2024 : ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న క్రీడాకారులకు గుడ్ న్యూస్​. ఇండియన్ రైల్వేలో స్పోర్ట్స్​ కోటాలో గ్రూప్​-సీ, గ్రూప్​-డీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Railways
Indian Railways (ANI)

Indian Railway Sports Quota Jobs 2024 : వెస్ట్రన్​ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-సీ, గ్రూప్-డీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు సెప్టెంబర్‌ 14వ తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాల వివరాలు

  • లెవెల్‌-4/5 : 5 పోస్టులు
  • లెవెల్‌-2/3 : 16 పోస్టులు
  • లెవెల్‌-1 : 43 పోస్టులు
  • మొత్తం పోస్టులు : 64

విద్యార్హతలు
RRC WR Sports Quota Job Qualifications :

  • లెవెల్‌-4/5 పోస్టులకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
  • లెవెల్‌-2/3 పోస్టులకు అభ్యర్థులు ఐటీఐ, పన్నెండో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి.

క్రీడాంశాలు : బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.

వయోపరిమితి
RRC WR Sports Quota Jobs Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము
RRC WR Sports Quota Job Application Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఈబీసీ, (ఎక్స్​-సర్వీస్​మెన్​) ఈఎస్‌ఎం , మహిళలు, దివ్యాంగులు, మైనారిటీలు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
RRC WR Sports Quota Jobs Selection Process : విద్యార్హతలు, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగాhttps://rrccr.com/ వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • RRC CR Sports Quota Recruitment 2024 అప్లికేషన్ లింక్​పై క్లిక్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
  • అప్పుడు మీకొక యూజర్​ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • ఈ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో మళ్లీ వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
RRC WR Sports Quota Jobs Apply Last Date :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 16
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్​ 14

ఐటీఐ అర్హతతో - HALలో 324 ఉద్యోగాలు - దరఖాస్తుకు మరికొద్ది రోజులే ఛాన్స్​! - HAL Recruitment 2024

ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలు - రూ.69వేల శాలరీ - అప్లై చేసుకోండిలా! - ITBP Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.