ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 'నవోదయ'లో 1377 నాన్​-టీచింగ్ పోస్టులు భర్తీ! - navodaya job notification 2024

NVS Recruitment 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్​-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

non teaching jobs 2024
NVS Recruitment 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 10:13 AM IST

NVS Recruitment 2024 : నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్​-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితికి చెందిన కార్యాలయాల్లో, జవహర్ నవోదయ విద్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఫిమేల్​ స్టాఫ్​ నర్స్​ - 121 పోస్టులు
  • అసిస్టెంట్​ సెక్షన్ ఆఫీసర్​ - 5 పోస్టులు
  • ఆడిట్ అసిస్టెంట్​ - 12 పోస్టులు
  • జూనియర్​ ట్రాన్స్​లేషన్ ఆఫీసర్​ - 4 పోస్టులు
  • లీగల్ అసిస్టెంట్ - 1 పోస్టు
  • స్టెనోగ్రాఫర్​ - 23 పోస్టులు
  • కంప్యూటర్ ఆపరేటర్ - 2 పోస్టులు
  • క్యాటరింగ్ సూపర్​వైజర్​ - 78 పోస్టులు
  • జూనియర్ సెక్ట్రటేరియట్​ అసిస్టెంట్​ - 381 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ కమ్​ ప్లంబర్ - 128 పోస్టులు
  • ల్యాబ్​ అటెండెంట్​ - 161 పోస్టులు
  • మెస్ హెల్పర్ - 442 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్​ - 19 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1,377

విద్యార్హతలు
Navodaya Non-Teaching Jobs Qualifications : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు 10, 10+2, డిగ్రీ, డిప్లొమా, పీజీలు చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి
Navodaya Non-Teaching Jobs Age Limit : అభ్యర్థుల వయస్సు ఆయా పోస్టులను బట్టి మారుతుంటుంది. అయితే అన్ని పోస్టులకు కలిపి కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

దరఖాస్తు రుసుము
Navodaya Non-Teaching Job Application Fee :

  • ఫిమేల్ స్టాఫ్ నర్స్​ పోస్టులకు జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
  • మిగతా అన్ని పోస్టులకు జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం
Navodaya Non-Teaching Jobs Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ట్రేడ్/ స్కిల్ టెస్ట్​ చేస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో కూడా ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

Navodaya Examination Centers :

  • ఏపీలోని పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం
  • తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్​, మహబూబ్​నగర్​, నిజామాబాద్​, ఖమ్మం, కరీంనగర్​

నోట్ : ఆన్​లైన్​ దరఖాస్తు, పరీక్ష తేదీలు త్వరలో వెల్లడించనున్నారు.

సెబీలో 'అసిస్టెంట్ మేనేజర్' పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

ఇంజినీరింగ్ అర్హతతో NHPCలో 280 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.