ETV Bharat / education-and-career

పది, ఇంటర్​ అర్హతతో - నౌకాదళంలో అగ్నివీర్​ పోస్టులు - మహిళలూ అర్హులే! - Navy Agniveer Recruitment 2024

Navy Agniveer Recruitment 2024 : భారత నౌకాదళంలో పనిచేయాలని ఆశించే అభ్యర్థులు అందరికీ గుడ్ న్యూస్​. అగ్నివీర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌), సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) నోటిఫికేషన్లను భారత నౌకాదళం విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఈ రెండు పోస్టులకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.

Navy Agniveer Recruitment 2024
NAVY JOBS 2024 (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 10:54 AM IST

Navy Agniveer Recruitment 2024 : ఇండియన్ నేవీ అగ్నివీర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌), సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) నోటిఫికేషన్లను విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్హతలతో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు రకాల పోస్టులకు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులకు ముందుగా రెండు దశల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. తరువాత ఫిజికల్​, మెడికల్ టెస్ట్​లు నిర్వహించి, అర్హులైన వారిని అగ్నివీర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు అగ్నివీరులుగా సేవలు అందించాల్సి ఉంటుంది. ఇవి శాశ్వత ఉద్యోగాలు కాదు. అయినప్పటికీ అగ్నివీర్‌గా ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రం శాశ్వత ఉద్యోగ అవకాశం దక్కుతుంది. అంటే ఎంపికైన మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్‌ పోస్టుల్లో దేనికి ఎంపికైనప్పటికీ నాలుగేళ్లు సేవలు అందించినందుకుగాను అగ్నివీరులకు సేవానిధి ప్యాకేజీ అందిస్తారు.

ఏటా రెండు సార్లు
ఇండియన్‌ నేవీ ఏటా రెండుసార్లు అగ్నివీర్‌ ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్‌ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేస్తోంది. అర్హత కలిగినవాళ్లు రెండు పరీక్షలకు కూడా విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు

  • మొదటి సంవత్సరం : నెలకు రూ.30,000
  • రెండో సంవత్సరం : నెలకు రూ.33,000
  • మూడో సంవత్సరం : నెలకు రూ.36,500
  • నాలుగో సంవత్సరం : నెలకు రూ.40,000

పదో తరగతి, ఇంటర్​ విద్యార్హతలతో పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ, ఈ రెండింటిలో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు అన్నీ సమానంగానే ఉంటాయి. ట్రైనింగ్ సమయంలో సంవత్సరానికి 30 రోజులపాటు సెలవులు ఇస్తారు. ఆరోగ్య సమస్యలు వస్తే సిక్‌ లీవ్స్​ కూడా ఇస్తారు.

4 ఏళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు అగ్నివీరులకు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు కూడా అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పిస్తారు. చివరిలో అగ్నివీర్‌ 'స్కిల్‌ సర్టిఫికెట్‌' ప్రదానం చేస్తారు.

నాలుగేళ్ల తరువాత పరిస్థితి ఏమిటి?
నావీ నుంచి వైదొలిగిన అగ్నివీరులకు కార్పొరేట్‌ సంస్థల్లో, సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలు, విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు సంస్థలు జాబ్​ సెలక్షన్స్​లో అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించాయి. ఒకవేళ వీరు కనుక సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ దిశగా అడుగులు వేయాలని అనుకుంటే, బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చూస్తారు.

సేవానిధి
అగ్నివీరులు ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతాన్ని కార్పస్‌ ఫండ్‌కు జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే రూ.30,000 జీతంలోంచి రూ.9000 మినహాయిస్తారు. అంటే అగ్నివీరుని చేతికి రూ.21,000 మాత్రమే అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 ఆర్థిక నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,550 చేతికి వస్తుంది. రూ.10,950 కార్పస్ ఫండ్​కు వెళ్తుంది. నాలుగో ఏట అగ్నివీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తంగా నాలుగేళ్ల వ్యవధిలో అగ్నివీరుని నుంచి సేవానిధిలోకి రూ.5.02 లక్షలు జమ అవుతుంది. అంతే మొత్తాన్ని గవర్నమెంట్ కూడా జమ చేస్తుంది. అంటే రూ.10.04 లక్షల కార్పస్ ఏర్పడుతుంది. దీనికి వడ్డీని జతచేసి అగ్నివీరునికి అందిస్తారు. అంటే అగ్నివీరునికి సుమారుగా రూ.11.71 లక్షలు చేతికి అందుతాయి. ఈ డబ్బుపై పన్ను కూడా ఉండదు.

మధ్యలో మానేస్తే?
అగ్నివీరులు కావాలనుకుంటే 4 ఏళ్లలోపే విధుల నుంచి వైదొలగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అగ్నివీరుని వేతనం నుంచి జమ అయిన మొత్తాన్ని మాత్రమే చేతికి అందిస్తారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం మాత్రం దక్కదు.

ఈ ప్రయోజనాలు ఉండవు!
అగ్నివీరులకు పెన్షన్​, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) లాంటివి రావు. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌గా కూడా పరిగణించరు.

పర్మినెంట్ జాబ్​!
4 ఏళ్ల వ్యవధి పూర్తి చేసుకున్న ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మంది అగ్నివీర్​లను నేవీలో సెయిలర్‌ హోదాతో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. నాలుగేళ్ల శిక్షణ, సర్వీస్​ వ్యవధిలో అత్యుత్తమ ప్రతిభను, పనితీరును ప్రదర్శించిన అభ్యర్థులనే ఇలా రెగ్యులర్ జాబ్​లోకి తీసుకుంటారు. ఇలా అవకాశం పొందినవారు పదవీ విరమణ వయస్సు వరకు కొనసాగుతారు. వీరికి అన్ని రకాల ప్రోత్సాహాలు, ప్రయోజనాలు లభిస్తాయి. పదవీ విరమణ తరువాత పింఛన్​ కూడా వస్తుంది.

ఎంపిక ప్రక్రియ
ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్‌-1లో ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్టు (ఐనెట్‌) పెడతారు. రాష్ట్రాల వారీగా కేటాయించిన పోస్టుల ప్రకారం కటాఫ్‌ మార్కులు మారుతాయి. ఇందులో క్వాలిఫై అయినవారు స్టేజ్‌-2కు అర్హత సాధిస్తారు. ఈ దశలో ముందుగా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ) చేస్తారు. ఇందులో నిర్ణీత శారీరక ప్రమాణాలు ఉన్నవారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.

SSR Qualifications

  • ఇంటర్​లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టులగా 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా
  • ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ ఆటోమొబైల్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీల్లో 50% మార్కులతో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా
  • మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 50% మార్కులతో 2 ఏళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసినవారు కూడా ఈ పోస్టులకు అర్హులే.

SSR Age Limit : ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు 2003 నవంబర్ 1 నుంచి 2007 ఏప్రిల్​ 30 మధ్యలో జన్మించి ఉండాలి. అది కూడా అవివాహితులైన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.

MR Qualifications : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

MR Age Limit : అభ్యర్థులు 2003 నవంబర్ 1 నుంచి 2007 ఏప్రిల్​ 30 మధ్యలో జన్మించి ఉండాలి.

దరఖాస్తు రుసుము : ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు జీఎస్‌టీతో కలిపి రూ.649 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మే 27

గుడ్ న్యూస్​ - SBIలో 12,000 పోస్టులు - 85% ఉద్యోగాలు వారికే! - SBI Hiring

యూజీసీ నెట్​ దరఖాస్తు గడువు పొడిగింపు - వెంటనే అప్లై చేసుకోండిలా! - UGC NET 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.