BEL Recruitment 2024 : నవరత్న హోదా కలిగి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగాల వివరాలు
- జనరల్ - 210 పోస్టులు
- ఓబీసీ - 139 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 52 పోస్టులు
- ఎస్టీ - 39 పోస్టులు
- ఎస్సీ - 77 పోస్టులు
- మొత్తం పోస్టులు - 517
జోన్ల వారీగా పోస్టుల వివరాలు
- సెంట్రల్ జోన్ - 68 పోస్టులు
- ఈస్ట్ జోన్ - 86 పోస్టులు
- వెస్ట్ జోన్ - 139 పోస్టులు
- నార్త్ జోన్ - 78 పోస్టులు
- నార్త్ ఈస్ట్ జోన్ - 15 పోస్టులు
- సౌత్ జోన్ - 131 పోస్టులు
ఇంజినీరింగ్ విభాగాలు
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్, టెలికమ్యునికేషన్, కమ్యునికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
విద్యార్హతలు
BEL Trainee Engineer Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా బీఈ/ బీటెక్/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాస్ అయ్యుండాలి. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు కేవలం ఉత్తీర్ణత సాధిస్తే చాలు.
వయోపరిమితి
BEL Trainee Engineer Job Age Limit : బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఎంఈ/ ఎంటెక్ చేసిన అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించి ఉండకూడదు.
దరఖాస్తు రుసుము
BEL Trainee Engineer Job Application Fee :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.150 + 18% జీఎస్టీ చెల్లించాలి.
- దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
BEL Trainee Engineer Job Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ చేసి ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
BEL Trainee Engineer Job Salary : ట్రైనీ ఇంజినీర్లకు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000 చొప్పున జీతం అందిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.35,000; మూడో ఏట నెలకు రూ.40,000 చొప్పున సాలరీ ఇస్తారు.
దరఖాస్తు విధానం
BEL Trainee Engineer Job Apply Process :
- అభ్యర్థులు ముందుగా బీఈఎల్ అధికారిక వెబ్సైట్ https://bel-india.in/ ఓపెన్ చేయాలి.
- 'ట్రైనీ ఇంజినీర్ అప్లికేషన్' లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- పరీక్ష ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
BEL Trainee Engineer Job Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఫిబ్రవరి 28
- దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మార్చి 13
SSC భారీ నోటిఫికేషన్ - 2049 పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా!
ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 314 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!