Questions To Teachers On Children School First Day : వేసవి సెలవులు పూర్తవడంతో పాఠశాలలు అన్నీ తెరుచుకున్నాయి. సమ్మర్ హాలీడేస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన పిల్లలు.. బడిబాట పట్టారు. కాగా, సెలవుల తర్వాత పిల్లలను స్కూల్‌కు పంపే క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్తుంటారు. అయితే, ఇలా స్కూల్‌కు వెళ్లినప్పుడు ఊరికినే తిరిగి రాకుండా.. పిలల్ల గురించి పలు విషయాలను టీచర్లను అడిగి తెలుసుకోమంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఏ స్థాయిలో ఉన్నారు ? : తల్లిదండ్రులు.. పిల్లలతో కలిసి స్కూల్‌కు వెళ్లిన మొదటి రోజు.. గత సంవత్సరం తమ పిల్లలు ఎలా చదివారో తప్పక అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారు ఏ సబ్జెక్ట్‌లో తక్కువ ప్రతిభ కనబరిచారు.. దానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి టీచర్లను అడగాలని చెబుతున్నారు. దీనివల్ల తమ పిల్లవాడు చదువులో ఏ స్థాయిలో రాణిస్తున్నాడో పేరెంట్స్‌కు తెలుస్తుందని అంటున్నారు.
ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదా - ఈ టిప్స్ పాటిస్తే ఆల్‌సెట్!
ప్రవర్తన ఎలా ఉంది ?: చాలా మంది పిల్లలు ఇంట్లో ఒక విధంగా.. పాఠశాలలో మరొక విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే, స్కూల్లో పిల్లల ప్రవర్తన.. తోటి విద్యార్థులతో ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే టీచర్‌లు పాఠాలు చెప్పేటప్పుడు శ్రద్ధతో వింటున్నారా ? లేదా అనేది కూడా కనుక్కోవాలని.. పిల్లలతో ఏవైనా గొడవలు పడుతున్నారా ? లేదా ? అనే విషయం కూడా అడగాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పించవచ్చని.. తద్వారా జీవితంలో ఎత్తుకు ఎదుగుతారని అంటున్నారు.
చురుకుగా ఉంటున్నారా ?: కొంతమంది పిల్లలు బాగా చదువుతారు.. కానీ, స్కూల్‌లో జరిగే ఆటలు, పాటల వంటి ఇతర కార్యక్రమాలలో పాల్గొనరు. అయితే, తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లినప్పుడు తమ పిల్లలు చురుకుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారా ? లేదా ? అనే విషయాన్ని అడిగి తెలుసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే.. పిల్లలు చదువుతో పాటు అన్ని ప్రోగ్రామ్స్‌లో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఆటలు ఆడటం వల్ల చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. వారు ఆటల్లో మంచి ప్రతిభ కనిబరిస్తే.. మంచి క్రీడాకారులు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
హోమ్‌వర్క్ చేస్తున్నారా ?: పిల్లలకు హోమ్ వర్క్ అనేది కామన్. ఇంటి దగ్గరా ఎలానూ చేస్తారు.. కానీ క్లాస్‌లో టీచర్ ఇచ్చిన వర్క్ ఎలా చేస్తున్నారో కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు. శ్రద్ధగా చేస్తున్నారా? లేదంటే మొక్కబడిగా చేస్తున్నారో కూడా కనుక్కోవాలని వివరిస్తున్నారు.
సక్సెస్ ఫుల్ స్టూడెంట్స్‌కు - ఈ అలవాట్లు ఉండవు!
పరీక్షలు అంటేనే భయంగా ఉందా? ఈ 9-టిప్స్ పాటిస్తే విజయం మీదే!