ETV Bharat / business

భారీ లాభాలు ఇచ్చే పెన్నీ స్టాక్స్‌ను ఎంచుకోవాలా? ఈ బెస్ట్‌ టిప్స్ మీ కోసమే! - Penny Stocks Investment Tips - PENNY STOCKS INVESTMENT TIPS

Penny Stocks Investment Tips : మీరు పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? ఈ పెన్నీ స్టాక్స్ ద్వారా భారీ లాభాలు సంపాదించాలని అశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. పెన్నీ స్టాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్‌, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. అందుకే మంచి పెన్నీ స్టాక్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఈ ఆర్టికల్‌ ద్వారా తెలుసుకుందాం.

penny stocks
penny stocks (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 1:02 PM IST

Penny Stocks Investment Tips : ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మంచి లాభాలను తెచ్చిపెట్టే స్టాక్స్‌ను కొనుగోలు చేయాలని మదుపర్లు ఆశపడుతుంటారు. అయితే ఇందులో చాలా రిస్క్ ఉంటుంది. అందుకే పెన్నీ స్టాక్స్ అంటే ఏమిటి? వాటిలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందా? రిస్క్‌ ఉంటుందా? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, చాలా తక్కువ ధరల్లో ట్రేడయ్యే షేర్లను పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తారు. సాధారణంగా ఈ పెన్నీ స్టాక్స్ ధర రూ.30లోపునే ఉంటుంది. ఈ పెన్నీ స్టాక్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిని విక్రయించాలనుకున్నప్పుడు బయ్యర్స్‌ ఎక్కువగా ఉండరు. కొన్ని పెన్నీ స్టాక్స్ కాలక్రమేణా డీలిస్ట్ అయిపోతాయి కూడా. కనుక పెన్నీ స్టాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో నష్టభయం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

పెన్నీ స్టాక్స్ ఫీచర్స్

  • లిక్విడిటీ లేకపోవడం : సాధారణంగా పెన్నీ స్టాక్స్ క్రయవిక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంటాయి. కనుక లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది.
  • రిస్క్ ఎక్కువ : పెన్నీ స్టాక్స్ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఇవి కొన్నిసార్లు గణనీయమైన రాబడిని అందిస్తాయి. కానీ అన్ని పెన్నీ స్టాక్స్ మార్కెట్లో రాణించలేవు. కొన్నింటి ధర కాలక్రమేణా క్షీణిస్తుంది.
  • మల్టీబ్యాగర్ : కొన్ని పెన్నీ స్టాక్స్ మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ను అందిస్తాయి. అయినప్పటికీ పెన్నీ స్టాక్స్ పెట్టుబడులు అన్నీ కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని చెప్పలేం.
  • హెచ్చుతగ్గులు ఎక్కువే : పెన్నీ స్టాక్స్ ట్రేడింగ్‌లో ఒడుదొడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల వార్తల వల్ల పెన్నీ స్టాక్స్ రేటు అమాంతం పెరిగిపోవచ్చు లేదా భారీగా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ వల్ల కూడా పెన్నీ స్టాక్స్ రేట్లు పెరుగుతుంటాయి.

పెన్నీ స్టాక్స్ గురించి మదుపర్లు తెలుసుకోవాల్సిన విషయాలు
స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చినవారు, ట్రేడింగ్‌పై అవగాహన పెంచుకోవాలనుకునేవారు పెన్నీ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ ధర తక్కువగా ఉంటుంది. కనుక చాలా తక్కువ సంఖ్యలో పెన్నీ స్టాక్స్ కొనుక్కుంటే, ఆర్థిక నష్టం పెద్దగా రాదు. పైగా స్టాక్ మార్కెట్ బిగినర్స్ ట్రేడింగ్ చిట్కాలను నేర్చుకోవచ్చు.

  • అధిక రాబడి : కొన్ని పెన్నీ స్టాక్స్ దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని మదుపర్లకు అందిస్తాయి. కానీ చాలా ఓపిక అవసరం.
  • ఊహాగానాలు : పెన్నీ స్టాక్స్ ట్రేడింగ్‌ సాంకేతిక విశ్లేషణ కంటే ఊహాగానాల ఆధారంగానే ఎక్కువగా నడుస్తుంది.
  • తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ : చిన్న కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక తీవ్ర ఒడుదొడుకులు వచ్చినప్పుడు సదరు కంపెనీలు మూతపడే అవకాశాలు, భారీగా నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి.

పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాలు?

  • పెన్నీ స్టాక్స్ ధర తక్కువగా ఉంటుంది. అధిక ధర గల షేర్లను కొనుగోలు చేయలేనివారు వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
  • పెన్నీ స్టాక్స్ అధిక రాబడిని అందిస్తాయి. ఎందుకంటే వీటి ధర తక్కువగా ఉంటుంది. వాటిలో కొద్దిగా వృద్ధి కనిపించినా గణనీయమైన మొత్తంలో లాభాన్ని పొందొచ్చు. అయితే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కనుక మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన పెన్నీ స్టాక్స్‌ను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది.

పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే నష్టాలు?

  • పెన్నీ స్టాక్స్‌ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. తక్కువ లిక్విడిటీ, తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. పైగా మోసాలు, ధరలు తారుమారు చేయడం లాంటివి ఉంటాయి. కనుక ఈ స్టాక్స్ ధరలు ఒక్కసారిగా పడిపోయే అవకాశాలు ఉంటాయి.
  • చిన్న కంపెనీల వ్యాపార, వ్యవహారాల వివరాలు మదుపర్లకు అందుబాటులో ఉండవు.
  • కొందరు ఆపరేటర్లు కృత్రిమంగా రేట్లను పెంచేసి అమాయక ఇన్వెస్టర్లను ముగ్గులోకి లాగుతారు. వారు ఎంటర్ అయిన తర్వాత ఈ మోసగాళ్లు దగ్గరున్న స్టాక్స్‌ను అమ్ముకుని వైదొలగడం లాంటివి చేస్తారు.

పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలు

  • మీరు పెన్నీ స్టాక్స్‌ కొనబోయే ముందు, ఆ కంపెనీ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్లు, కంపెనీ ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ చెక్ చేసుకోవాలి. స్థిరమైన రాబడి, తక్కువ రుణ ఈక్విటీ నిష్పత్తి కలిగి ఉన్న పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.
  • పెట్టుబడి పెట్టే ముందు పరిశ్రమ ట్రెండ్స్‌ను, కంపెనీ వృద్ధి సామర్థ్యాన్ని అంచనా వేయాలి. మీ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగించాలి. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. తగినంత లిక్విడిటీ, ట్రేడింగ్ వాల్యూమ్ ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
  • వీటితో పాటు పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు కచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది.

స్మాల్​ క్యాప్​ Vs మిడ్ క్యాప్​ Vs లార్జ్ క్యాప్​ స్టాక్స్​ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​!

స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయారా? ఈ టిప్స్ పాటిస్తే లాభాల బాట పట్టడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.