UTS App For Train Ticket Booking : చాలా మంది తరచూ రైల్లో ప్రయాణిస్తుంటారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునేవారికి రైలు ప్రయాణం బాగుంటుంది. సాధారణంగా బెర్త్ బుక్ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు జర్నీ కోసం అయితే కౌంటర్ దగ్గర క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కౌంటర్ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) యాప్‌ను ప్రారంభించింది.
క్విక్ బుకింగ్, ఫ్లాట్ ఫాం టికెట్, సీజన్ టికెట్, క్యూఆర్ బుకింగ్ కోసం ఈ యూటీఎస్ యాప్ వాడొచ్చు. తక్కువ దూరం ప్రయాణం చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాన్-సబర్బన్ ట్రావెల్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును కూడా యూటీఎస్ అందిస్తోంది. అంటే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణానికి కూడా 3 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవచ్చు. 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటే ప్రయాణం రోజే టికెట్ కొనుగోలు చేయాలి.
టికెట్ బుకింగ్ ఈ విధంగా:
- యూటీఎస్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- యాప్‌లో లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే Normal Booking సెక్షన్లోకి వెళ్లాలి.
- అందులో కనిపించే Book and travel, Book and Print ఆప్షన్లలో మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
- పేపర్ లెస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మొబైల్లో జీపీఎస్‌ను ఆన్ చేయాలి.
- తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్లను సెలక్ట్ చేసుకోవాలి.
- వెంటనే మీ ప్రయాణానికి అందుబాటులో ఉన్న రైళ్లు, వాటి ఛార్జీలు డిస్ప్లే అవుతుంటాయి.
- Get fare పై క్లిక్ చేయాలి. తరువాత మీకు నచ్చిన ట్రైన్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే సమయం, ఫ్లాట్‌ఫాం నంబర్, ట్రైన్ నంబర్, టికెట్ ధర మొదలైన వివరాలు కనిపిస్తాయి.
- ప్యాసింజర్ల సంఖ్య, ట్రైన్ టైప్, పేమెంట్ టైప్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
- కిందకు స్క్రోల్ చేసి బుక్ టిక్కెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆర్-వాలెంట్, డెబిట్ కార్డు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మొదలైన పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- మీకు నచ్చిన విధానంలో పేమెంట్ చేసి, టికెట్ బుక్ చేసుకోవాలి.
- టికెట్ బుక్ చేసే ముందు పేపర్ మోడ్ సెలక్ట్ చేసుకుంటే, దగ్గర్లోని యూటీఎస్ కియోస్క్ లేదా రైల్వే బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి ప్రింట్ తీసుకోవాలి.
- ఆర్-వాలెట్‌ను టాప్-ఆప్ చేయడం తప్పనిసరి కాదు. ఒక వేళ చేస్తే వాలెట్ టాప్-అప్పై 3శాతం బోనస్ లభిస్తుంది.
- ఈ యాప్ ద్వారా ఒకప్పుడు కేవలం 5 కిలోమీటర్లకు వరకు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పది కిలోమీటర్ల పరిధి వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
జొమాటో న్యూ సర్వీస్ - ఇకపై ఒకేసారి 50 మందికి సరిపడా ఫుడ్ డెలివరీ! - Zomato Large Order Fleet