Useful Tips To Maintain Car AC In Summer : ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉన్నా, కారులో బయటకు వెళ్లినా ఉక్కపోతతో చెమటలు పడుతున్నారు. కొందరు తమ కారులో ఏసీ(ఎయిర్ కండిషనింగ్) ఉన్నా, దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అందుకే ఇప్పుడు మండే వేసవిలోనూ కారులో చల్లగా ప్రయాణించేందుకు ఉపయోగపడే టాప్-5 ఏసీ మెయింటెనెన్స్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
Car AC Maintenance Tips : ఏసీ బాగా పనిచేయాలంటే, ముందుగా మీ కారులో ఉన్న ఏసీ మంచి కండిషన్లో ఉందో, లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏసీ సరిగ్గా పనిచేయకపోతే మీరు ప్రయాణంలో ఉక్కపోతకు గురవుతారు. కొన్నిసార్లు చెమటలు పట్టి డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. అందుకే మీ కారు క్యాబిన్‌ను చల్లగా ఉంచడానికి ఉపయోగపడే టాప్-5 టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సర్వీస్ చేయించాలి : మీ కారులోని ఏసీని ఒకసారి చెక్, అవసరమైతే దానికి సర్వీసింగ్ చేయించాలి. అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా ఏసీ పని చేస్తుంది. వేసవి ఉష్ణోగ్రతల నుంచి మీకు ఉపశమనాన్ని అందిస్తుంది.
ప్రీ-కూలింగ్ : మీరు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కారులో ఉన్న వేడి గాలి బయటకు వెళ్లేందుకు, కొన్ని నిమిషాల పాటు డోర్స్, విండోలను తెరిచి ఉంచాలి. మీ కారులో సన్‌రూఫ్ కూడా ఉన్నట్లయితే, దానిని తెరవాలి. అప్పుడే పై నుంచి వేడి గాలి త్వరగా బయటకు వెలుతుంది. ఏసీ ఆన్ చేసిన తరువాత కారు లోపల త్వరగా చల్లబడుతుంది.
ఆప్టిమైజ్ ఏసీ సెట్టింగ్స్ : మీరు కారులోకి ఎక్కిన తర్వాత ఏసీని ఆన్ చేసి, రీసర్క్యులేషన్ మోడ్‌ను స్విచ్-ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏసీ స్వచ్ఛమైన బయటి గాలిని తీసుకోగలుగుతుంది. అంతేకాకుండా క్యాబిన్‌ను వేగంగా చల్లబరుస్తుంది. క్యాబిన్ ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కూలింగ్‌ను మరింత పెంచేందుకు రీసర్క్యులేషన్ మోడ్‌ను తిరిగి ఆన్ చేయాలి.
అడ్జెస్ట్ టెంపరేచర్ : కారులో మరింత చల్లదనం కావాలంటే, ఏసీ టెంపరేచర్‌ను బాగా తగ్గించాలి. ఎయిర్‌ఫ్లోను పెంచాలి. దీని వల్ల కారు క్యాబిన్ బాగా కూల్ అవుతుంది. కానీ ఫ్యూయెల్ మాత్రం కాస్త ఎక్కువగా ఖర్చవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి.
కస్టమైజ్ ఎయిర్‌వెంట్స్ : మీరు ఒంటరిగా కారులో ప్రయాణిస్తున్నట్లయితే, మీ వైపు ఉన్న ఏసీ వెంట్‌లను మాత్రమే తెరవాలి. మిగిలిన వాటిని బంద్ చేయాలి. దీని వల్ల ఏసీ మీకు మాత్రమే తగులుతుంది. ఒకవేళ మీ పక్కన ఫ్రంట్ సీట్లో మరొక వ్యక్తి ఉంటే, మీ ఇద్దరికి కూలింగ్ ఉండేలా ఏసీ వెంట్స్‌ను ఎడ్జెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే, మండే వేసవిలోనూ మీరు కూల్‌గా ప్రయాణించవచ్చు.
వర్కింగ్ ఉమెన్‌కు, కాలేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే టాప్-10 స్కూటీస్ ఇవే! - Best Scooters