Upcoming New Gen Maruti Suzuki Cars : మన దేశంలో పరిచయం అక్కరలేని పేరు మారుతి సుజుకి. ఏటా అత్యధిక కార్ల సేల్స్‌తో ఈ కంపెనీ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంటుంది. మారుతి సుజుకి మరి కొన్ని నెలల్లో మూడు కొత్త కార్లను భారత విపణిలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అవి: మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ, న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎస్యూవీ. ఈ న్యూ మోడల్ కార్లలో కొత్త రకం ఇంజన్లు, ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.
1. Maruti Suzuki Swift CNG : న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు సీఎన్జీ వెర్షన్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితియార్ధంలో ఈ కారు లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. ఈ కారును ప్రస్తుతం భారత దేశ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రీడిజైన్ చేస్తున్నారు. అయితే ఈ సీఎన్జీ వల్ల పవర్ ఔట్పుట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 32 కి.మీ/కిలో మైలేజ్ ఇస్తుందని సమాచారం. ఇక పెట్రోల్ వెర్షన్ కంటే ఈ సీఎన్జీ ఇంజిన్‌తో వస్తున్న కారు ధర రూ.90,000-రూ.95,000 ఎక్కువగా ఉండనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.
2. New Gen Maruti Suzuki Dzire : ఈ న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారును వచ్చే నెల(జులై)లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు 'డిజైర్' మోడల్‌లో వచ్చిన కార్లు దేశంలో పెద్దఎత్తున అమ్ముడయ్యాయి. కొత్త మోడల్‌తో సేల్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కారుపై కొత్తగా సన్‌రూఫ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, సన్‌రూఫ్ ఫెసిలిటీ పొందిన తొలి సెడాన్ కారుగా న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ నిలుస్తుంది. ఈ కారు ఎక్స్ట్రా బూట్ స్పేస్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీని కొలతలన్నీ పాత మోడల్ తరహాలోనే ఉంటాయని సమాచారం. ఈ కారులో 1.2లీటర్ Z సిరీస్‌కు చెందిన మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజిన్ అమరుస్తున్నారు. ఇది 111.7 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. దీనికి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లను జతపరుస్తున్నారని సమాచారం. వీటికి అదనంగా ఆటోమేటిక్ HVAC, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సైతం కారులో ఉంటాయి. కొత్త తరహా ఫ్రంట్ గ్రిల్, అప్‌గ్రేడ్ చేసిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త సెట్ బంపర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
3. Maruti Suzuki eVX Electric SUV : ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్న మారుతి సుజుకి 2024 చివరి నాటికి మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్న ఈ కారును, బోర్న్-ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. దీన్నే మారుతి-టయోటా సంయుక్తంగా నిర్మిస్తున్న కార్లలో ఉపయోగించనున్నారు. ఈ కారు 2700mm వీల్‌బేస్‌తో 4.3 మీటర్ల పొడవు ఉంటుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కారుల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒక ఛార్జ్‌పై 400 కిలో మీటర్ల రేంజ్‌తో 48 kWh బ్యాటరీ ఒకటి. 550 కిలో మీటర్ల రేంజ్ ఇచే 60 kWh బ్యాటరీ మరొకటి. హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ వంటి వాటికి పోటీగా మారుతి సుజుకి ఈ కారును విడుదల చేయనుంది.
ఒకే ఏడాదిలో ఉద్యోగాలు మారారా? ITR ఫైలింగ్‌లో ఫారం-16 ఎలా పొందాలంటే? - ITR Form 16