ETV Bharat / business

సీనియర్ సిటిజన్లు ఇలా ITR దాఖలు చేస్తే ఫుల్​ బెనిఫిట్స్! - itr filing 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 2:34 PM IST

Senior Citizen ITR Benefits : మీరు సీనియర్ సిటిజన్లా? ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఐటీఆర్ రిటర్నులు దాఖలు సమయంలో సీనియర్ సిటిజన్స్​కు అనేక పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉంటాయి. అందుకే ఐటీఆర్ ఫైల్ దాఖలు చేసేటప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి.

Senior Citizen ITR Benefits
Senior Citizen ITR Benefits (Getty Images)

Senior Citizen ITR Benefits : ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్​ కొన్ని కీలక నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారికి ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్​ ఐటీఐర్ దాఖలుకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక ఫారమ్​లను అందిస్తుంది. మరెందుకు ఆలస్యం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేసి సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్​ గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆదాయం ఆధారంగా ఐటీఆర్ ఫారమ్​ ఫైలింగ్
సీనియర్ సిటిజన్స్​ వారి ఆదాయం ఆధారంగా నిర్దిష్ట ITR ఫారమ్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న పింఛనుదారులు పన్ను దాఖలు కోసం ఐటీఆర్- 1ను నింపాల్సి ఉంటుంది. ఆస్తి, ఇతర వనరులు, మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందినవారు ఐటీఆర్-2ను ఎంచుకోవాలి. వ్యాపారాలు, వృత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదించే పెన్షనర్లు ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.

సాధారణ లేదా నాన్-సీనియ‌ర్ పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్​, సూప‌ర్‌ సీనియర్ సిటిజన్స్​కు అధిక పన్ను మినహాయింపు పరిమితి ఉంటుంది. 60 ఏళ్లలోపు వ‌య‌సు ఉన్న వారి వార్షిక ఆదాయం రూ.2.50 ల‌క్ష‌లకు మించి ఉంటే ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయాలి. అయితే సీనియ‌ర్ సిటిజన్స్​కు ఈ మిన‌హాయింపు ప‌రిమితి రూ.3 ల‌క్ష‌లు, సూప‌ర్ సీనియ‌ర్ సిటిజన్స్​ కు(80 ఏళ్లు పైబడినవారికి) రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది. అంతేకాకుండా రేట్లు తదనుగుణంగా మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్​కు రూ. 3లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం వరకు పన్ను విధిస్తారు.

ఫారమ్​ 16
సీనియర్ సిటిజన్స్, పెన్షన్ రూపంలో ఆదాయం పొందేవారు తమ యజమాని నుంచి ఫారమ్​ 16 పొందుతారు. ఉద్యోగులకు కంపెనీ అందించే ఫారమ్​ 16లో వేతన ఆదాయం, పన్ను కోతలు, టీడీఎస్ వంటి సమగ్ర సమాచారం ఉంటుంది. కొన్ని ఆర్థిక లావాదేవీల‌ను నిర్దిష్ట ప‌రిమితికి మించి చేసిన‌ప్పుడు, సంబంధిత స‌మాచారాన్ని ఆయా సంస్థ‌లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు అందజేస్తాయి. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఈ స‌మాచారం మొత్తం ఫారమ్​ 26ఏఎస్‌లో పొందుప‌రుస్తుంది.

పన్ను మినహాయింపులు
60 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న సీనియ‌ర్ సిటిజన్స్​ 80TTB కింద బ్యాంకు, పోస్టాఫీసు పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట‌ర్మ్ డిపాజిట్ల నుంచి వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వ్యక్తులు ఈ తగ్గింపులు పొందలేరు. ఇది కేవలం పాత ప‌న్ను విధానం ఎంచుకున్న వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

ఫారమ్​ 15H
సాధార‌ణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్స్​కు రూ.50వేలు మించిన‌ వ‌డ్డీ ఆదాయంపై మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్) త‌గ్గిస్తాయి. అంతకంటే తక్కువ వడ్డీ ఆదాయం ఉంటే టీడీఎస్ తగ్గించొద్దని సీనియర్ సీటిజెన్స్ బ్యాంకులకు అభ్యర్థించవచ్చు. ఈ క్రమంలో టీడీఎస్ త‌గ్గించ‌కుండా సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఫారమ్​ 15 హెచ్‌ను ఇవ్వొచ్చు.

సీనియ‌ర్ సిటిజ‌న్లు రివ‌ర్స్ మోర్ట‌గేజ్ స్కీమ్ కింద మూలధన లాభాలపై మినహాయింపులను పొందవచ్చు. రివ‌ర్స్ మోర్ట‌గేజ్ స్కీమ్ ద్వారా త‌మ ఇంటిని త‌న‌ఖా పెట్ట‌డం ద్వారా జీవితాంతం నెల‌వారీ క్ర‌మ‌మైన చెల్లింపులు పొంద‌వ‌చ్చు. సీనియర్ సిటిజన్లు రూ. 50,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపులు, రూ. 1 లక్ష వరకు నిర్దిష్ట వ్యాధులకు సంబంధించిన వైద్య ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు. అంతేకాకుండా సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రూ. 50,000 వరకు వచ్చే వడ్డీ ఆదాయం, వారి మొత్తం ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే టీడీఎస్ నుంచి మినహాయింపు ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎటువంటి ఆదాయాన్ని కలిగి ఉండకపోతే సీనియర్ సిటిజన్స్ ముందుస్తు పన్ను చెల్లించనక్కర్లేదు.

సెక్షన్ 87A
సీనియర్ సిటిజన్స్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద మినహాయింపులను పొందవచ్చు. చాప్టర్ VI-A కింద తగ్గింపుల తర్వాత రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు పన్ను రాయితీ అందిస్తుంది.

సెక్షన్ 194P
ఈ సెక్షన్​ ప్రకారం 75 సంవ‌త్స‌రాలు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న వ్య‌క్తుల ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. కేవలం పింఛను పొందే అదే బ్యాంకులో డిపాజిట్ల నుంచి వ‌డ్డీ ఆదాయాన్ని పొందుతున్న‌ప్పుడు మాత్రమే ఈ ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయాల్సిన అవ‌సరం లేదు. అయితే ఇక్క‌డ ఆ వ్య‌క్తికి ఇత‌ర ఆదాయ వ‌న‌రులు ఉండ‌కూడ‌దు. ఇందుకు అర్హతగల సీనియర్ సీటిజన్స్ తప్పనిసరిగా ఫారమ్​ 12BBAలో ఒక డిక్లరేషన్‌ను నింపాల్సి ఉంటుంది.

కుటుంబంలో ఒక్కొక్కరికీ ఆరోగ్య బీమా భారమా? ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీనే బెస్ట్​ ఆప్షన్! - Family Floater Health Insurance

మీ PF​ బ్యాలెన్స్​ను NPSకు బదిలీ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Can I Switch From EPF To NPS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.