Stock Market Today 1st February 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇప్పుడు మరలా పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. యూఎస్ ఫెడ్ కూడా త్వరలో కీలక వడ్డీ రేట్లు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 61 పాయింట్లు లాభపడి 71,813 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 22 పాయింట్లు వృద్ధి చెంది 21,747 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఐటీసీ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎల్ అండ్ టీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ
జీఎస్టీ సంస్కరణలు
జనవరి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 10.4 శాతం మేర పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. ఇది తదుపరి దశ జీఎస్టీ సంస్కరణలకు మంచి ఊతం ఇస్తోంది.
ఆసియా మార్కెట్లు
Global Markets Today 1st February 2024 : ఏసియన్ మార్కెట్లలో సియోల్, షాంఘై, హాంకాంగ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. టోక్యో మాత్రం నష్టాల్లో కొనసాగుతోంది. యూఎస్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, బుధవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,660.72 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open 1st February 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.02గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices 1st February 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.40 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 81.71 డాలర్లుగా ఉంది.
నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే?
భారీగా తగ్గనున్న మొబైల్ ఫోన్స్ ధరలు - బడ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం