Stock Market Today April 19th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. దీనితో వరుస 4 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 599 పాయింట్లు లాభపడి 73,088 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 151 పాయింట్లు వృద్ధి చెంది 22,147 వద్ద ముగిసింది.
2.00 PM : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 578 పాయింట్లు లాభపడి 73,064 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 153 పాయింట్లు వృద్ధి చెంది 22,149 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today April 19th 2024 : వరుసగా ఐదో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ కుదేలవుతున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం, ప్రపంచ మార్కెట్లపై చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండడం - దేశీయ మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఫలితంగా ఇండియన్ మార్కెట్లు గత 5 రోజులుగా భారీగా నష్టపోతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 378 పాయింట్లు నష్టపోయి 72,110 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 123 పాయింట్లు కోల్పోయి 21,872 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టీసీఎస్
విదేశీ పెట్టుబడులు
FIIs Investments : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,260 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లు
Asian Markets Today April 19th 2024 : ఏసియన్ మార్కెట్లైన సియోల్, టోక్యో, హాంకాంగ్, షాంఘై అన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు కూడా నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Open March April 19th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 6 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.58గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices April 19th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2.27 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 89.09 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices April 19th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్ - రూ.76వేలు దాటిన బంగారం ధర! - Gold Rate Today
EPF అకౌంట్ బ్లాక్ అయిందా? ఇలా చేస్తే అంతా సెట్! - How To Unblock EPF Account