Stock Market Close March 4th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 73,872 వద్ద ఆల్-టైమ్ హైరికార్డుతో స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 27 పాయింట్లు వృద్ధి చెంది 22,405 ఆల్-టైమ్ హైలెవల్ను టచ్ చేసింది.
Stock Market Today March 4th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ జీవన కాల గరిష్ఠాలను తాకింది. ఓ దశలో నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకుని లాభాల బాట పట్టాయి. ఎనర్జీ, బ్యాంకింగ్ సెక్టార్స్ రాణిస్తుండడమే ఇందుకు కారణం. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతానికి చేరడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తోంది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 77 పాయింట్లు లాభపడి 73,884 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 62 పాయింట్లు వృద్ధి చెంది 22,401 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగున్న షేర్లు : ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతి సుజుకి, రిలయన్స్
- నష్టాల్లో కొనసాగుతున్న షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టైటాన్, ఎం అండ్ ఎం, ఏసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో
స్పెషల్ ట్రేడింగ్ సెషన్
శనివారం నిర్వహించిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం, శనివారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.81.87 కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.
ఆసియా మార్కెట్లు
Asian Markets March 4th 2024 : ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ మార్కెట్ మాత్రం నష్టాల్లో కొనసాగుతోంది. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Value March 4th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.86గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices March 4th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.11 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83.64 డాలర్లుగా ఉంది.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?
క్రెడిట్ కార్డ్ 'రివార్డ్ పాయింట్స్' పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!