ETV Bharat / business

కొత్త ఇల్లు కొనుగోలు చేశారా?- అయితే మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులివే!

New House Buying Checklist : మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేశారా? అయితే ఇల్లు కొనుగోలు తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైన పనులేంటో మీకు తెలుసా? కలల సౌధాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

New House Buying Checklist
New House Buying Checklist
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 5:26 PM IST

New House Buying Checklist : ఇల్లు కొనుగోలు అనేది చాలా మందికి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. జీవితకాలంలో అతిపెద్ద కొనుగోలులో ఇల్లు అతి ముఖ్యమైనది. ప్రధానంగా మంచి ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారే ఇంటిని సొంతం చేసుకోవడంలో ముందుంటారు. ఇంటి కొనుగోలుతోనే బాధ్యత తీరిపోదు. కలల సౌధాన్ని పొందిన తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైన పనులేంటో తెలుసుకుందాం.

యాజమాన్య హక్కు బదిలీ
ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను రికార్డులు సహా అన్ని సంబంధిత పత్రాలను మీ పేరు అప్‌డేట్‌ చేసుకోవాలి. కొనుగోలుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కనీసం 2 సెట్లు జిరాక్స్‌లను తీయించి వేర్వేరు ప్రదేశాలలో ఉంచుకోవాలి. లోన్‌పై ఇంటిని కొనుగోలు చేస్తే అది తీరేవరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ బ్యాంకులు తమ వద్దే ఉంచుకుంటాయి. కనుక, వాటి ఫొటోకాపీ మీ దగ్గర ఉండడం అవసరం. ఒరిజినల్‌ కాపీ మీ దగ్గర ఉంటే మీ అల్మరా/బ్యాంకు లాకర్‌లో భద్రపరిచినా కూడా ప్రతి రెండు నెలలకు చెక్‌ చేసుకోవడం మంచింది. ఈ కాలంలో చాలా మంది పత్రాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. పత్రాలను స్కాన్‌ తీయించి కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లో ఒక ఫైలు, డీవీడీలో ఒక ఫైలు సేవ్‌ చేసుకోవడం వల్ల భవిష్యత్‌లో ఉపయోగముంటుంది.

ఎక్నాలెడ్జ్​మెంట్
చాలా మంది ఇల్లు కొనుగోలుకు బ్యాంకు రుణాలను తీసుకునేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఆస్తి పత్రాలతో పాటు లోన్‌ను ప్రాసెస్‌ చేయడం ప్రారంభించిన రోజు నుంచి బ్యాంకుకు సమర్పించే ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ లిస్ట్​ను రూపొందించండి. ఒరిజినల్‌ పత్రాలను పేర్కొంటూ లెటర్‌ ఇవ్వాలని బ్యాంకు వారిని అడగండి. ఇది డాక్యుమెంట్స్‌ జాబితాకు సంబంధించి ఎక్నాలెడ్జ్‌మెంట్‌లాగా పనిచేస్తుంది.

ఆస్తికి బీమా, ఎలక్ట్రికల్‌ తనిఖీ
సంపాదించిన ఆస్తిని రక్షించుకోవడం యజమాని బాధ్యత. ఆస్తికి బీమా చేయించడం అవసరం. హోమ్​ ఇన్సూరెన్స్​ వల్ల ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, అగ్నిప్రమాదాల లాంటి వివిధ ప్రమాదాల నుంచి ఇంటికి, ఇంటిలోని వస్తువులకు రక్షణగా ఉంటుంది. కాబట్టి, వివిధ బీమా పాలసీలను పరిశోధించి సరైన బీమాను ఎంచుకోండి. ఇల్లు కొనుగోలు తర్వాత ఆ ఇంటిలో ఉండే మొత్తం ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్స్‌ను చెక్‌ చేసుకోండి. ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. మీరు కొత్త ఇంటితో పాటు ఫ్యాన్లు, ఎయిర్‌ కండీషనర్‌, లైట్లు/ఎలక్ట్రికల్‌ పరికరాలను పొందినట్లయితే వాటి పనితీరు, హామీ/వారంటీ కోసం వాటన్నింటినీ తనిఖీ చేయించడం తప్పనిసరి. ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. వీటిపై ఖర్చు మధ్యతరగతి వారు కూడా తట్టుకునే విధంగానే ఉంటుంది.

యుటిలిటీ సేవల బదిలీ
కొత్త ఇంటికి మారినప్పుడు విద్యుత్‌, నీటి/గ్యాస్‌ కనెక్షన్‌ లాంటి యుటిలిటీ సర్వీసులను మీ పేరుకు ట్రాన్స్​ఫర్​ చేసుకోవాలి. సేల్ డీడ్, ఐడీ జిరాక్సులు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. వీటిని పొందడానికి మీరు ఇంటిని కొన్న యజమాని (విక్రేత) నుంచి ‘నో-అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ అవసరం కావచ్చు. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడే ఇప్పటికే ఉన్న బకాయిలను మునుపటి యజమాని సెటిల్‌ చేశారని నిర్ధారించుకోండి. అన్ని కరస్పాండెన్స్‌, బిల్లులు మీ కొత్త చిరునామాకు మార్చుకోవాలి.

అస్తి పన్ను రికార్డులో పేరు నమోదు
మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత, ఆస్తి యాజమాన్యాన్ని మీ పేరుకు బదిలీ చేయడం తప్పనిసరి. ఆస్తి పన్ను రికార్డ్స్‌ను మీ పేరు మీద మార్చుకోవాలి. ఆస్తికి సంబంధించిన జిరాక్స్‌ ప్రతులతో స్థానిక మున్సిపల్‌ ఆఫీసుకు వెళ్లి చలానా కట్టి ఆస్తి పన్ను రికార్డులో మీ పేరు ఉండే విధంగా చూసుకోవాలి. మీ పేరుతో రిజిస్ట్రేషన్‌ కచ్చితంగా జరిగిందో లేదో నిర్ధారించుకోవడానికి ఈసీ (ఎన్‌కంబరెన్స్‌ సరిఫికెట్‌)కు అప్లై చేసుకోవచ్చు. అయితే ఆస్తి నమోదు తేదీ నుంచి ఒక వారం తర్వాత ఈసీ పొందడం ఉత్తమం.

సొసైటీ షేర్‌ సర్టిఫికెట్‌
అపార్ట్‌మెంట్లల్లో ప్రతి ప్రాపర్టీ ఓనర్‌కు వాటాగా సొసైటీ షేర్లు ఉండొచ్చు. అలాంటివైమైనా ఉంటే మీ పేరు మీద బదిలీ చేయించుకోవాలి. సొసైటీకి సేల్‌ డీడ్‌ కాపీని అందజేసి వాటా బదిలీకి రిక్వెస్ట్ పెట్టాలి. సేల్‌ డీడ్‌ కాపీని సొసైటీకి లేదా రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ఇచ్చి ఆ రికార్డులలో మీ పేరును అప్‌డేట్‌ చేయించుకోవాలి.

ఆదాయపు పన్ను రిటర్న్స్​
మీరు ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దాన్ని ఐటీఆర్‌(ఆదాయపు పన్ను రిటర్న్​)లో ప్రకటించాల్సిన అవసరం లేదు. అయితే, మీ వార్షిక ఆదాయం రూ.50 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆదాయపు పన్ను రిటర్న్‌లో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తిని ప్రకటించవలసి ఉంటుంది. ఒకవేళ ఇంటికి కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్నట్లయితే, ఐటీఆర్‌లో పన్ను మినహాయింపును పొందొచ్చు. ఆస్తి నుంచి రెంట్ ఆదాయన్ని పొందుతున్నట్లయితే దాన్ని ఐటీఆర్‌లో వెల్లడించి తగిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి రుణానికి దరఖాస్తు చేసినట్లయితే ఆదాయుపు పన్ను చట్టం సెక్షన్‌ 80సి, సెక్షన్‌ 80ఈఈ, సెక్షన్‌24(బి) కింద కొన్ని ప్రయోజనాలను పొందొచ్చు. సెక్షన్‌ 80సి రుణానికి సంబంధించిన ప్రధాన మొత్తంపై పన్ను ప్రయోజనం. సెక్షన్‌ (బి) వడ్డీపై పన్ను ప్రయోజనం. సెక్షన్‌ 80ఈఈ మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి (చెల్లించే వడ్డీపై) పన్ను ప్రయోజనం. ఈ పన్ను ప్రయోజనాలు అనేక టెర్మ్స్​ అండ్ కండీషన్స్​కు లోబడి ఉంటాయి.

మెయింటెనెన్స్ ఖర్చులు
ఇంటి విలువ, దీర్ఘాయువును కాపాడుకోవడానికి సరైన నిర్వహణ అవసరం. మీరు కొనుగోలు చేసిన ఇంటికి రిపేర్లు ఏమైనా ఉంటే గృహప్రవేశం కంటే ముందుగానే వాటిని చేయించండి. ఏదైనా, తక్షణ మరమ్మతు సహా ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌, పెయింటింగ్‌ పనులు అవసరం మేరకు చేయించడం ఉత్తమం. కొంతమంది ఇల్లు అమ్మేటప్పుడు కనిపించని మరమ్మతులు చేయించకుండానే తెలివిగా అమ్మేస్తుంటారు. ఇటువంటి విషయాలలో అనుభవజ్ఞుల సూచనలు, సంప్రదింపులు అవసరం. అందుచేత ఇల్లు కొనుగోలు చేసేటప్పుడే కొంత అదనపు బడ్జెట్‌ను చేతిలో ఉంచుకోవాలి.

ఇల్లు అనేది అతి పెద్ద పెట్టుబడి. మీ తదనంతరం మీ ఆస్తిని పొందేందుకు హక్కుదారులెవరు అనే విషయాన్ని పేర్కొనడం కూడా చాలా అవసరం. ఈ విషయంలో అవసరమైతే న్యాయనిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఫిక్స్​డ్​ డిపాజిట్లపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

మల్టిపుల్ హోమ్ లోన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.