Google Wallet Launched In India : టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 'గూగుల్ వాలెట్'ను లాంఛ్ చేసింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్లో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్‌లు, కీలు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.
Google Wallet Vs Google Pay
ఈ గూగుల్ వాలెట్‌ను నేరుగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది 'గూగుల్ పే' యాప్ కంటే చాలా భిన్నమైన సేవలు అందిస్తుంది. గూగుల్ పే ద్వారా మనం కేవలం ఆర్థిక నిర్వహణ మాత్రమే చేయగలుగుతాం. అంటే దానిని బేసిక్ పేమెంట్ యాప్‌గా మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం. కానీ గూగుల్ వాలెట్ అనేది పేమెంట్ యాప్ కాదు. గూగుల్ వాలెట్లో మీ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈవెంట్ టిక్కెట్స్, ఎయిర్‌లైన్ బోర్డింగ్ పాసులు, స్టూడెంట్ ఐడీ లాంటి వాటిని డిజిటల్ వెర్షన్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీరు క్రెడిట్, డెబిట్ కార్డ్స్ కోసం ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
రూమర్స్ నిజం అయ్యాయి!
గూగుల్ వాలెట్ ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్‌లోనూ దీనిని లాంఛ్ చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు అయితే థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా గూగుల్ వాలెట్ సేవలను వినియోగిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు దీనిని గూగుల్ అధికారికంగా ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
Sundar Pichai To Be Billionaire : గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ త్వరలోనే బిలియనీర్ కానున్నారు. 2015 సంవత్సరంలో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన గత తొమ్మిదేళ్లలో ఆ కంపెనీని అత్యున్నత స్థానాలకు చేర్చారు. దానికి తగిన ప్రతిఫలం సుందర్‌కు దక్కింది. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ షేర్ల ధరలు వేగంగా పెరగడం, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అద్భుత ఆర్థిక ఫలితాలు రావడం వంటివి ఆయనకు కలిసొచ్చాయి. ప్రస్తుతం సుందర్ పిచాయ్ నికర సంపద విలువ 100 కోట్ల డాలర్లకు చేరువైంది. 'బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్' ఈ విషయాన్ని వెల్లడించింది.
బెస్ట్ స్కీమ్ - రోజుకు రూ.13 కడితే చాలు - జీవితాంతం నెలకు రూ.5000 పెన్షన్! - Atal Pension Yojana
మంచి ఎలక్ట్రిక్ కార్ కొనాలా? లాంగెస్ట్ రేంజ్ కలిగిన టాప్-5 మోడల్స్ ఇవే! - Top Range Electric Cars