Best Bikes Under 2 Lakh : ఇండియాలో బైక్స్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్ స్టైలిష్ లుక్స్‌తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. KTM 200 Duke : స్పోర్టీ బైక్ కొనాలని ఆశించేవారికి కేటీఎం 200 డ్యూక్ మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 199.5 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 25 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజీ 35 కి.మీ/లీటర్. ఈ బైక్ సూపర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మార్కెట్లో ఈ కేటీఎం డ్యూక్ ధర సుమారుగా రూ.1.93 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Bajaj Pulsar NS200 : బజాజ్ కంపెనీ రిలీజ్ చేసిన బీస్ట్ మోడల్ ఈ పల్సర్ ఎన్ఎస్200. ఇది మంచి డైనమిక్, స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. దీనిలో 199.5 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. ఇది 24.5 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. దీనిపై లీటర్ పెట్రోల్‌తో 40.36 కి.మీ ప్రయాణించవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.49 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Royal Enfield Classic 350 : రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లకు ఇండియన్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. అందులో బెస్ట్ సెల్లింగ్ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఈ ఛార్మింగ్ బైక్‌లో 349 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీని మైలేజ్ 30-37 km/l. ఇది 5 వేరియంట్లలో 12 రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.93 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Yamaha R-15 V4 : మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలని ఆశించేవారికి ఈ యమహా ఆర్-15 వీ4 బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్‌లో 155 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 18.1 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ యమహా బైక్ మైలేజ్ 55.20 కి.మీ/లీటర్. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.82 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Honda CB200X : క్రేజీ లైఫ్ అడ్వెంచర్స్ కోరుకునే వారికి హోండా సీబీ200 ఎక్స్ బైక్ చాలా బాగుంటుంది. దీనిలో 184.4 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంది. ఈ బైక్‌పై లీటర్ పెట్రోల్‌తో 40 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.1.46 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Honda Hornet 2.0 : స్టైలిష్ లుక్స్‌తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్‌ల్లో హోండా హార్నెట్ 2.0 ఒకటి. దీనిలో 184.4సీసీ సామర్థ్యం కలిగిన BS6-కంప్లైంట్ పవర్ట్రైన్ ఉంది. ఇది 17.26 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్ 57.35 కి.మీ/లీటర్. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.39 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Bajaj Avenger 220 Street : ఈ బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ క్రూయిజ్ స్టైల్ కలిగి ఉంటుంది. దీనిలో 200 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ బైక్ మైలేజ్ 40 కి.మీ/లీటర్. ఇది సింగిల్-ఛానల్ ఏబీఎస్, కంఫర్టబుల్ వైడ్ సీట్లను కలిగి ఉంటుంది. యూనిక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలని అనుకునేవారు ఈ బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్‌ను ఎంచుకోవచ్చు. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.1.43 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Suzuki Gixxer SF 250 : సుజుకి కంపెనీ విడుదల చేసిన పవర్ఫుల్ బైక్ ఈ గిక్సర్ ఎస్ఎఫ్ 250. దీనిలో 249 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీనిపై లీటర్ పెట్రోల్‌తో 38.5 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇది స్టైలిష్ లుక్స్‌తో, రైడింగ్ చేయడానికి మంచి కంఫర్ట్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.1.92 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Yamaha MT 15 : ఆఫ్-బీట్ అపీల్‌తో యమహా ఎంటీ 15 యూత్‌ను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ బైక్‌లో 155 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 18.4 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. ఈ యమహా బైక్ మైలేజ్ 56.87kmpl. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.36 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. Oben Rorr : ఈ ఒబెన్ రోర్ అనేది ఒక ఎలక్ట్రిక్ బైక్. భారతదేశంలో లాంగెస్ట్ రేంజ్ కలిగి ఈవీ బైక్ ఇదే. దీనిలో 1000 వాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. దీనితో 200 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. దీనిలో కటింగ్-ఎడ్జ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మంచి ఎకో-ఫ్రెండ్లీ బైక్ కొనాలని అనుకునేవారికి ఈ ఒబెన్ రోర్ బైక్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారుగా రూ.1.49 లక్షలు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టాటా, మారుతి కార్లపై భారీ ఆఫర్స్ - ఆ మోడల్‌పై ఏకంగా రూ.1.53 లక్షలు డిస్కౌంట్!
రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? ఈ టాప్-5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!