Anant Ambani Radhika Wedding Justin Bieber : దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న (శుక్రవారం) అనంత్-రాధిక జంట సంగీత్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కెనడాకు చెందిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ముంబయికి శుక్రవారం చేరుకున్నారు. సంగీత్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు బీబర్‌ను రప్పించిన అంబానీ ఫ్యామిలీ, ఆయనకు రూ.83 కోట్ల మేర డబ్బు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. సంగీత్ కార్యక్రమంలో బీబర్ తన గాత్రంతో అతిథులందరినీ ఆకట్టుకోనున్నారు. అడెల్, డ్రేక్, లానా డెల్ రే వంటి సింగర్స్ సైతం సంగీత్‌లో పాటలు పాడనున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Maharashtra: Canadian singer-songwriter Justin Bieber arrived at the Mumbai airport earlier today to attend Anant Ambani and Radhika Merchant's wedding festivities. pic.twitter.com/hlkkVs3m40
— ANI (@ANI) July 5, 2024
చిన్న వయసులోనే 'ఓ బేబీ బేబీ' అంటూ అందర్నీ ఆకట్టుకున్న పాప్ స్టార్ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఆయన సారీ, లవ్ యువర్ సెల్ఫ్ వంటి పాటలతో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 2017లో భారత్‌లో సంగీత కచేరీకి వచ్చిన జస్టిన్ బీబర్ మళ్లీ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. 2022లో మరోసారి భారత్‌కు రావాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో రాలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా జస్టిన్ బీబర్ గాత్రానికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాగే ప్రపంచంలో పాపులర్ సింగర్. అందుకే అంబానీ కుటుంబం అనంత్- రాధిక సంగీత్‌లో ఆయనతో పాటలు పాడించనున్నట్లు తెలుస్తోంది. భారీగా ఖర్చు చేసి మరి బీబర్‌ను భారత్‌కు రప్పించినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా కార్యక్రమాలు
గత కొద్ది రోజులుగా అంబానీ ఇంట పెళ్లి ముందస్తు వేడుకలు జరుగుతున్నాయి. జులై 2న పేద యువతీయువకులకు సామూహిక వివాహాలు జరిపించింది అంబానీ ఫ్యామిలీ. జులై 3న మామెరు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అనంత్-రాధిక పెళ్లి షెడ్యూల్
జులై 12 నుంచి మూడు రోజుల పాటు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగనున్నాయి. జులై 12న శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. జులై 13న శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరగనుంది. జులై 14న మంగళ్ ఉత్సవ్‌తో వివాహ వేడుకలు ముగుస్తాయి.