ETV Bharat / bharat

రేవ్ పార్టీ అంటే ఏమిటి? - అందులోకి వెళ్లిన వారు ఏం చేస్తారు? - What is Rave Party in Telugu

Rave Party: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్​ టాపిక్​ అంటే రేవ్​ పార్టీ. అసలు రేవ్​ పార్టీ అంటే ఏమిటి? పోలీసులు ఎందుకు రైడ్​ చేస్తున్నారు? ఇది చట్ట వ్యతిరేకం ఎందుకైంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rave Party
What is Rave Party in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 5:32 PM IST

What is Rave Party in Telugu: ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్‌ విపరీతంగా పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా.. ఫుల్​గా ఎంజాయ్‌ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ.. కాస్త డబ్బున్న వాళ్లు అయితే.. ఈ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు తాజాగా రేవ్‌ పార్టీ అనే మాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. అందుకు కారణం.. బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని పోలీసులకు పట్టుబడటమే. అయితే గతంలో చాలా మంది రేవ్‌ పార్టీలు నిర్వహించి పట్టుబడినా.. సెలబ్రేటీలు ఎందుకు ఈ పార్టీల్లో పాల్గొంటారు? అసలు ఈ రేవ్‌ పార్టీ అంటే ఏంటి? ఇందులో ఏం చేస్తారు? ఎందుకు పోలీసులు పబ్​లపై రైడ్​ చేయకుండా రేవ్​ పార్టీలపై రైడ్​ చేస్తారు? లాంటి విషయాలపై నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పార్టీ కల్చర్‌ అనేది 1950ల్లో ఇంగ్లండ్‌లో మొదలైంది. ఆ తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ పార్టీలో తొలుత మ్యూజిక్‌, డ్యాన్స్‌ అంటూ నార్మల్​గానే ఎంజాయ్‌ చేసేవారు. నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్‌ కొత్త రూపు సంతరించుకుని.. ఒక క్లోజ్​డ్‌ ప్రదేశంలో చెవులు పగిలిపోయే మ్యూజిక్‌ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. పార్టీ చేసుకునే వారు. వైల్డ్‌ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలను ‘రేవ్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ రేవ్​ అన్న పదం జమైకా బాష నుంచి వచ్చింది.

బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి - తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు గుర్తింపు - Police Raids Rave Party Bengaluru

అయితే సాధారంగా మద్యం సేవిస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు.. ఈ రేవ్‌ పార్టీలు వేరు. రేవ్‌ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్‌ అని పిలుస్తారు. క్రమక్రమంగా ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది. డ్రింకింగ్​ మాత్రమే కాకుండా.. యాంఫేటమిన్, ఎల్‌ఎస్‌డీ, కెటామైన్, మెథాంఫేటమిన్ , కొకైన్ , గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రహస్యంగా వినియోగించడం ప్రారంభం అయింది.

కాగా, ఈ పార్టీలను 24 గంటల నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. అయితే, రేవ్ పార్టీకి పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. కొత్తవారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్తవారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు. అయితే ఇలాంటి చట్ట వ్యతిరేక రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే.. వెంటనే దాడి చేసి.. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, నిర్వహకులను అరెస్ట్‌ చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్‌ వాడకం విపరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్‌ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా.. కొంతమంది సెలబ్రేటీలు ఈ రేవ్‌ పార్టీ కల్చర్‌ నుంచి బయటపడలేకపోతున్నారు.

NOTE: ఇంటర్నెట్​లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ సమాచారం అందిస్తున్నాము.

బెంగళూరు రేవ్​ పార్టీపై స్పందించిన నటీనటులు శ్రీకాంత్​, హేమ - Actor Hema Reacts on Rave Party

ఎమ్మెల్యే రిసార్ట్​లో రేవ్​ పార్టీ.. కోట్ల రూపాయల డ్రగ్స్​ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.