UP Road Accident News Today : దేవుడి దర్శనం కోసం వెళ్తున్న ఓ ప్యాసింజర్ ఆటోను అటుగా వస్తున్న ఓ భారీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్ చిత్రకూట్ జిల్లాలోని ఝాన్సీ-మిర్జాపుర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 8మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారని చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం
'ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాం. క్షతగాత్రులను సమీపంలోని క్రియాగ్రాజ్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించాం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి పంపించాం. కాగా, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తోంది. మృతుల్లో ప్రస్తుతానికి ముగ్గురి వివరాలను మాత్రమే సేకరించగలిగాం' అని పోలీసులు తెలిపారు.
"ఝాన్సీ-మిర్జాపుర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ఆటో 8 మంది భక్తులతో దేవుడి దర్శనానికి వెళ్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఓ భారీ ట్రక్కు ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతుల్లో ఒకరు హమర్‌పూర్, ఇద్దరు కన్నౌజ్‌కు చెందినవారు. మిగతా ఇద్దరి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం."
- చక్రపాణి త్రిపాఠీ, ఏఎస్పీ
ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్కు- నలుగురు మృతి!
Four Sugarcane Breakers Died In Road Accident : మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సాంగ్లీ-రత్నగిరి హైవేలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిఉన్న ట్రాక్టర్‌ను వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీకొంది. దీంతో ట్రాక్టర్లో కూర్చున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, వీరంతా చెరకు కార్మికులుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక మైనర్‌తో పాటు, 3ఏళ్ల చిన్నారి కూడా ఉంది.
ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ట్రాక్టర్ చెడిపోవడం కారణంగానే దానిని రహదారిపై ఓ పక్కకు నిలిపి ఉంచారని చెప్పారు.
మృతులను షోలాపుర్ జిల్లా మంగళ్‌వేద తాలూకాలోని చిఖల్‌గి భుయార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్- నలుగురు మావోయిస్టులు హతం - Naxalites Killed In Encounter