హాథ్రస్ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. దీనికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సరైన చిక్సిత అందక కొందరు మరణించారు. ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి ఏమి కాదు. మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి' అని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
హాథ్రస్‌కు యూపీ సీఎం- క్షతగాత్రులకు యోగి పరామర్శ- కేసు దర్యాప్తుపై ఆరా - Hathras Stampede Incident
Published : Jul 3, 2024, 12:18 PM IST
|Updated : Jul 3, 2024, 12:40 PM IST
Hathras Stampede Live Updates : ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్‌లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు విడిచారు. మరో 28 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సత్సంగ్ పేరుతో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేర్వేరు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భోలే బాబా వెళ్లిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి పరుగెత్తారు. వేదిక సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరుపొంగిపొర్లటంతో రహదారి బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడటం వల్ల తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
LIVE FEED
హాథ్రస్‌లో పర్యటించిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తొలుత పోలీసు అధికారులతో సమావేశమై పరిస్థితి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తుపై ఆరా తీశారు. ఘటన జరిగిన వివరాలను పోలీసులు వారికి వివరించారు. అనంతరం హాథ్రస్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లిన సీఎం యోగి, చికిత్స అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితుల కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు.