Train Accident In Rajasthan : రాజస్థాన్ అజ్మేర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదార్ స్టేషన్ సమీపంలో ఉన్న గూడ్స్ రైలును సబర్మతి ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఫలితంగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్ తెలిపారు. ఈ ఘటన కారణంగా ఆరు రైళ్లు రద్దు చేశామని, మరో రెండు రైళ్లను వేరే మార్గాల ద్వారా మళ్లించామని కిరణ్ పేర్కొన్నారు. అజ్మేర్ రైల్వే స్టేషన్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సమాచారం కోసం 0145-2429642 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు.
సబర్మతి రైలులో ప్రయాణిస్తున్న వారిని అజ్మేర్ రైల్వే స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపిస్తామని చెప్పారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు అజ్మేర్ రైల్వే డిఆర్ఎమ్ రాజీవ్ ధన్కర్ చెప్పారు.
-
#WATCH | Rajasthan: BJP Ajmer MP Bhagirath Choudhary visits the site where 4 coaches of the Sabarmati-Agra superfast train derailed, earlier today. pic.twitter.com/WGt2c71NzY
— ANI (@ANI) March 18, 2024
రద్దు చేసిన రైళ్లు
12065 అజ్మేర్- దిల్లీ-సరాయ్ రోహిల్లా, 22987 అజ్మేర్- ఆగ్రా ఫోర్ట్, 09605 అజ్మేర్-గంగాపూర్ సిటీ, 09639 అజ్మేర్-రేవాడ్, 19735 జైపుర్ - మార్వార్ రైల్వే శాఖ రద్దు చేసింది. 12915 సబర్మతి - దిల్లీ రైలు, 17020 హైదరాబాద్-హిసార్ రైలు వేరే మార్గాల ద్వారా మళ్లించారు.
రైలు బోగీలో సిలిండర్లు బ్లాస్ట్
Fire In Train Compartment In Haryana : ఇటీవలే రైలు బోగీలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి మూడు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన హరియాణాలోని అంబాలా సిటీ రైల్వే స్టేషన్లో జరిగింది. బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల స్థానికంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం- ఇద్దరు మృతి- శిథిలాల కింద అనేక మంది!
పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా ఏడుగురు మృతి