ETV Bharat / bharat

టిఫిన్ సెంటర్ రుచిలో​ 'టమాట పుదీనా' చట్నీ - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ! - Tomato Mint Chutney Recipe

Tomato Mint Chutney Recipe in Telugu : కొంతమంది కూరల కంటే పచ్చళ్లనే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందులో ఎక్కువ మంది ఇష్టపడే వాటిలో టమాట పుదీనా చట్నీ ముందు వరుసలో ఉంటుంది. మరి ఇంట్లోనే టిఫెన్​ సెంటర్​ స్టైల్​ టమాట పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్​ చేయాలో తెలుసుకుందామా?

Tiffin Center Style Tomato Mint Chutney Recipe
Tomato Mint Chutney Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 11:27 AM IST

Tiffin Center Style Tomato Mint Chutney Recipe : చాలా మందికి టమాట పుదీనా చట్నీ అంటే ఎంతో ఇష్టం. కానీ అది ఇంట్లో చేయడం రాదు. ఒకవేళా చేసినా టిఫెన్​ సెంటర్​ టేస్ట్​ రాదు. దీంతో తెగ బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ పాటిస్తూ టమాట(Tomato) పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకున్నారంటే.. టిఫెన్ సెంటర్​లో లభించే పచ్చడి రుచికి ఏమాత్రం తీసిపోదు! పైగా దీనికోసం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన పనిలేదు. మరి, ఇంకెందుకు ఆలస్యం టమాట పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడే తెలుసుకోండి.

కావాల్సిన పదార్ధాలు :

  • టమాటలు - 4(ఎర్రగా పండినవి)
  • పుదీనా ఆకులు - అర కప్పు
  • నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 10(కాస్త కారం ఉన్నవి)
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • చింతపండు - కొద్దిగా(ఉసిరికాయంత)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - చిటికెడు

తాళింపు కోసం కావాల్సినవి :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 2
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • మినపప్పు - 1 టీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • జీలకర్ర - 1 టీస్పూన్

టిఫెన్​ స్పెషల్​ : "రాయలసీమ పల్లీ చట్నీ" - పదే పది నిమిషాల్లో రెడీ!

తయారీ విధానం :

  • ముందుగా పండిన టమాటలను మీడియం సైజ్​లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని, వెల్లుల్లి రెబ్బలు పొట్టి తొలగించుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై చిన్న కడాయి తీసుకొని లో ఫ్లేమ్ మంట ఉంచి నువ్వులను కాస్త వెయించుకోవాలి. ఆపై వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి.
  • ఆ తర్వాత మరో పాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చి మిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు, చింతపండు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
  • ఆపై టమాటలను మరీ నీరు ఇంకిపోయేదాక మగ్గించుకోకుండా.. కాస్త మెత్తబడి పైన తోలు ఉడిపోయే దాకా ఉడికించుకుంటే సరిపోతుంది.
  • అలా ఉడికాయనుకున్నాక.. ఆ మిశ్రమంలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.
  • అప్పుడు చల్లారిన ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా.. కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత తాళింపు కోసం పాన్​లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా వేడి అయ్యాక ఎండు మిర్చి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి.
  • ఆపై కరివేపాకు వేసి చిటపటలాడించిన తర్వాత.. అందులో మిక్సీ పట్టుకున్న టమాటల మిశ్రమాన్ని, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో నూనె పైకి తేలేవరకు మగ్గించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే.. ఎంతో రుచికరమైన టిఫెన్​ సెంటర్​ స్టైల్​ టమాట పుదీనా చట్నీ రెడీ!

పిల్లలు రోజూ వైట్​ రైస్​ ఎలా తింటారు మమ్మీ? - ఈ కలర్​ ఫుల్​ 'గార్లిక్ రైస్' పెట్టండి - మెతుకు మిగలదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.