ETV Bharat / bharat

చపాతీలు పూరీలా ఉబ్బుతూ, మెత్తగా రావాలా? - ఈ టిప్స్ పాటిస్తే చాలు! - Soft Chapati Making Tips - SOFT CHAPATI MAKING TIPS

Soft Chapati Making Tips : చపాతీలు మృదువుగా చేయడం ఒక కళ. అది అందరికీ రాదు. చాలా మంది చేసే చపాతీలు గట్టిగా వస్తుంటాయి. వాటిని తినాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాకాకుండా.. పూరీల్లా ఉబ్బుతూ మెత్తగా కావాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు! అవేంటో ఇప్పుడు చూద్దాం.

Simple Tips To Make Soft Chapati
Soft Chapati Making Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 10:30 AM IST

Simple Tips To Make Soft Chapati : కొంతమంది చపాతీ చేస్తే పూరీల్లా ఉబ్బడంతోపాటు మెత్తగా ఉంటాయి. తినడానికీ రుచిగా అనిపిస్తాయి. కానీ.. అందరికీ ఇలా చేయడం రాదు. మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే, డోంట్​వర్రీ.. మీకోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. అవి ఫాలో అయ్యారంటే మీరు చేసే చపాతీ(Chapati) కూడా పూరీల్లా ఉబ్బి మెత్తగా, సాఫ్ట్​గా వస్తాయి. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • చపాతీలు మెత్తగా రావాలంటే పిండి కలపడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. పిండి మెత్తగా ఉంటేనే చపాతీలు సాఫ్ట్​గా వస్తాయంటున్నారు.
  • చపాతీ పిండి కలిపేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. ఎక్కువగా నీళ్లు యూజ్ చేస్తుంటారు. కానీ, అలా కలపొద్దు. ఎందుకంటే.. ఇలా చేస్తే పిండి మూతకు, చేసేటప్పుడు పీటకు, చేతులకు అతుక్కుపోతుంది. కాబట్టి, పిండి తడిపేటప్పుడు వీలైనంత తక్కువ నీటిని యూజ్ చేయాలంటున్నారు.
  • ఒకవేళ పిండి మరీ మెత్తగా అయిపోయి చేతులకు అంటుకుంటూ ఉంటే కాస్తంత పొడి పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు. అలాగే.. గోధుమ పిండిని కలుపుకొనేటప్పుడు చల్లటి నీళ్లకు బదులుగా వేడి నీటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులు పాలు కూడా కలుపుకోవచ్చంటున్నారు. ఇక ఇప్పుడు పూరీల్లా ఉబ్బే.. మెత్తని, మృదువుగా చపాతీలను ఎలా చేసుకోవాలో చూద్దాం.

షుగర్ ఉన్నవారు రాత్రిపూట చపాతీలు తినొచ్చా?

  • ముందుగా నాణ్యమైన చపాతీ పిండిని తీసుకోవాలి. అవసరమైతే దాన్ని జల్లెడ పట్టుకుంటే మంచిది. ఇప్పుడు దాంట్లో మీకు తగినంత పిండిని.. ఒక వెడల్పాటి బౌల్​లో తీసుకొని కొద్దిగా నూనె, ఉప్పు, గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • ఉదాహరణకు మూడుకప్పుల పిండికి రెండు చెంచాల నూనె, చిటికెడు ఉప్పు, ఒకటిన్నర కప్పుల వాటర్ సరిపోతాయి.
  • పిండి కలుపుకునేటప్పుడు.. కొద్దికొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుంటే చపాతీ పిండి చక్కగా కలుస్తుంది. ఇలా వీలైనంత వరకు పిండి చాలా స్మూత్​గా అయ్యే వరకు మెత్తగా కలుపుకోవాలి.
  • అలా కలుపుకున్న పిండిపై తడి క్లాత్ కప్పి 25 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీని వల్ల పిండి మెత్తగా, మృదువుగా మారుతుంది. దాంతో చపాతీలు సాఫ్ట్​గా వస్తాయి.
  • అరగంట తర్వాత మళ్లీ ఆ పిండిని నిమిషంపాటు కలుపుకొని.. నిమ్మకాయ సైజ్​లో చిన్న చిన్న సమాన ఉండలుగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత చపాతీ పీట మీద మీకు కావాల్సిన సైజ్​లో చపాతీలు వత్తుకోవాలి. అయితే, ఇలా చేసేటప్పుడు పొడి పిండి తక్కువగా వాడడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎక్కువ పొడి పిండి వాడటం వల్ల చపాతీలు గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
  • ఇలా చేసుకున్న చపాతీలను మొదట పచ్చిదనం పోయేంత వరకు తక్కువ మంట మీద కాల్చుకోవాలి. ఆపై మంట మధ్యస్థంగా పెట్టి కాల్చుకుంటే అవి మాడిపోకుండా మెత్తగా, సాఫ్ట్​గా వస్తాయంటున్నారు నిపుణులు.
  • అలా కాల్చిన చపాతీలను.. వెంటనే మూత ఉండే పాత్రల్లో పెట్టుకోవాలి. లేదా హాట్‌బాక్స్‌లోనైనా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా, మృదువుగా, వేడిగా ఉంటాయని చెబుతున్నారు.

చపాతీ Vs అన్నం - ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా? - పరిశోధనలో తేలింది ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.