ETV Bharat / bharat

జైపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి - ఆరుగురికి తీవ్ర గాయాలు - Road Accident In Jaipur - ROAD ACCIDENT IN JAIPUR

Road Accident In Jaipur : రాజస్థాన్​, జైపుర్‌లోని మనోహర్‌పుర్-దౌసా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, జీపు ఢీకొనడం వల్ల స్పాట్​లోనే నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

car and jeep collision
Road Accident In Jaipur 4 dead, 6 injured (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 6:28 PM IST

Updated : May 16, 2024, 7:02 PM IST

Road Accident In Jaipur : రాజస్థాన్​, జైపుర్‌లోని మనోహర్‌పుర్-దౌసా హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, జీపు ఢీకొనడం వల్ల నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మనోహర్‌పుర్ దౌసా హైవేపై దంగర్వాడ మలుపు వద్ద, వేగంగా వచ్చిన ఓ జీపు, బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బొలెరో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వీరు దౌసా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఉత్తరప్రదేశ్​కు చెందినవారిగా చెబుతున్నారు. వీరిని సమీపంలోని ఎస్​ఎంఎస్​ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, వచ్చి మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు వైద్యులు తెలిపారు.

టైర్​ పేలి ట్రక్కును ఢీకొన్న కారు- 8మంది మృతి
మధ్యప్రదేశ్​​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ ట్రక్కును ఢీ కొనడం వల్ల 8మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన ఇందౌర్- అహ్మదాబాద్​ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కారు టైర్​ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ధార్ జిల్లాకు చెందిన కొందరు ఇందౌర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా ఘటాబిలోడ్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు గుణ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ సైతం ప్రాణాలు విడిచారు. 'మృతదేహాలు కారులో చిక్కుకున్నాయి. గ్రామస్థుల సాయంతో వాటిని అతి కష్టం మీద కారులో నుంచి తీశాం. క్షతగాత్రుడ్ని ఇందౌర్​లోని ఎంవై ఆస్పత్రికి తరలించాం. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగిస్తాం' అని పోలీసులు తెలిపారు.

ఒడిశాలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి
Road Accident In Odisha : ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు విడిచారు. బుధవారం రెండు ట్రక్కుల మధ్య ఓ కారు ఇరుక్కోవడం వల్ల జరిగిందీ దుర్ఘటన. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం పరీక్షలకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

'జూన్​ 4 తరువాత కూటమి విచ్ఛిన్నం ఖాయం' - మోదీ - PM Modi Slams Opposition

లోక్​ సభ ఎన్నికల్లో భారీగా పోలింగ్​ - మొదటి 4 దశల్లో 67% ఓటింగ్​ నమోదు - Lok Sabha Elections Voting Percent

Last Updated : May 16, 2024, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.