PM Modi Wayanad Visit : కొండచరియలు జారిపడి భారీ విధ్వంసానికి గురైన కేరళలోని వయనాడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు మోదీ చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోదీ పరామర్శించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
వాయుసేన హెలికాప్టర్‌లో!
శనివారం ఉదయం 11 గంటలకు మోదీ కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్‌లో వయనాడ్‌కు బయల్దేరారు. ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి సురేశ్ గోపి కూడా ఉన్నారు.
VIDEO | PM Modi (@narendramodi) arrives in Wayanad, #Kerala, to visit the landslides-hit areas of the district.#WayanadLandslide #WayanadTragedy #WayanadDisaster
— Press Trust of India (@PTI_News) August 10, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/jxBm9mzSGF
Kerala: Prime Minister Narendra Modi arrives at Kannur Airport; received by Governor Arif Mohammed Khan and CM Pinarayi Vijayan
— ANI (@ANI) August 10, 2024
PM Modi will visit Wayanad to review relief and rehabilitation efforts
(Pics source: CMO) pic.twitter.com/sfbP5lm0HU
#Kerala | Prime Minister @narendramodi conducts aerial survey of the landslide-affected area in Wayanad
— DD News (@DDNewslive) August 10, 2024
CM Pinarayi Vijayan is accompanying him#waynadlandslide pic.twitter.com/ES3sCmNVMl
బాధితులను పరామర్శించి!
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ, అక్కడి పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారితోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వయనాడ్ విలయంపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రధానికి వివరించారు అధికారులు.
Kerala: Prime Minister Narendra Modi visits the landslide-affected area in Wayanad. He is being briefed about the evacuation efforts.
— ANI (@ANI) August 10, 2024
Governor Arif Mohammed Khan, CM Pinarayi Vijayan and Union Minister Suresh Gopi are also present. pic.twitter.com/5Tz7mUMPkZ
VIDEO | PM Modi (@narendramodi) met survivors of landslides at AWS hospital in Kerala's Wayanad earlier today.
— Press Trust of India (@PTI_News) August 10, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/yBqT7j3G1s
అయితే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన గురించి తెలిసినప్పటి నుంచి సమాచారం తెలుసుకుంటున్నానని సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. విపత్తులో సహాయం చేయగలిగిన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నీ తక్షణమే సమాయత్తమయ్యాయని చెప్పారు. బాధితులను కలిసినట్లు వెల్లడించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించినట్లు పేర్కొన్నారు.
#WATCH | Kerala: Prime Minister Narendra Modi holds a review meeting with officials regarding the landslide-affected area in Wayanad.
— ANI (@ANI) August 10, 2024
Governor Arif Mohammed Khan, CM Pinarayi Vijayan and Union Minister Suresh Gopi are also present.
(Source: DD News) pic.twitter.com/Yv6c0sU36Y
"ఘటన జరిగిన రోజే ఉదయం నేను సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. సహాయం అందిస్తామని, వీలైనంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాను. NDRF, SDRF, సైన్యం, పోలీసులు , వైద్యులు, ప్రతి ఒక్కరూ బాధితులకు వీలైనంత త్వరగా సహాయం చేయడానికి ప్రయత్నించారు" అని మోదీ కొనియాడారు.
జులై 29-30 తేదీల్లో జరిగిన ఈ ప్రకృతి విపత్తులో కనీసం 226 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, మృతుల సంఖ్య 300లకు పైనే ఉంటుందని అనధికారిక వర్గాల సమాచారం. కొండచరియలు విరిగిపడటం వల్ల వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.