ETV Bharat / bharat

మోదీ రూటే సపరేటు- 'అన్ని వర్గాల్లోనూ ఒకే ఆదరణ- ప్రపంచ దేశాల నేతలందరిలో విభిన్నం' - Modi Most Popular Leader - MODI MOST POPULAR LEADER

Modi Most Popular Leader : ప్రపంచ నేతలందరిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అనుహ్యమైన ప్రజాదరణ ఉందని, విభిన్నమైన వ్యక్తి అని ఓ అంతర్జాతీయ పత్రికలో పేర్కొంది. ఎవరికైనా సామాన్యుల మద్దతు ఉండే ఉన్నత స్థాయి వర్గాల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ మోదీ మాత్రం రెండు వర్గాల్లోనూ మద్దతు లభిస్తోందని పత్రికలో అభిప్రాయపడింది.

Modi Most Popular Leader
Modi Most Popular Leader
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 7:13 AM IST

Modi Most Popular Leader : ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్నమైన వ్యక్తని అంతర్జాతీయ పత్రిక 'ఎకనామిస్ట్‌' అభిప్రాయపడింది. సాధారణంగా సామాన్య జనబాహుళ్యంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా ఆ దేశంలోని విద్యా, సంపద పరంగా ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో సాకుకూలత ఉండదు. కానీ, మోదీకి మాత్రం అటువంటి వారిలోనూ బహుళ ప్రజామోదం లభిస్తోందని పేర్కొంది. 'వై ఇండియాస్‌ ఎలైట్స్‌ బ్యాక్‌ మోదీ' అనే పేరుతో ఎకనామిస్ట్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

హుందాతనంతో కూడిన రాజకీయాలు (క్లాస్‌ పొలిటిక్స్‌), ఆర్థికం (ఎకనామిక్స్‌), ఉన్నత వర్గాల మెప్పు పొందడం (ఎలైట్‌ అడ్మిరేషన్‌) వంటి 3 అంశాలు మోదీకి ఈ వర్గాల్లో ఆదరణ కలిగి ఉండటానికి సహకరిస్తున్నాయని పేర్కొంది. ఒక రకంగా దీనిని మోదీ విభిన్న శైలిగా పిలవొచ్చని, డొనాల్డ్‌ ట్రంప్‌లాంటి నేతల గాటన కట్టినా మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోదీ అసాధారణ బలవంతుడు అని పత్రిక తెలిపింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగిన (మాస్‌ అప్పీల్‌) ఇలాంటి నేతలను ఉన్నతస్థాయి వర్గం వ్యతిరేకిస్తుంటుంది. అమెరికాలో ట్రంప్‌నకు, బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ సమయంలో అక్కడి నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు అని ఎకనామిస్ట్ పత్రిక అభిప్రాయపడింది.

అన్ని వర్గాల్లోనూ సానుకూలత
అమెరికాలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వారిలో 26శాతం మందే ట్రంప్‌నకు మద్దతు పలుకుతున్నారని గ్యాలప్‌ సర్వేలో వెల్లడైంది. అదే సామాన్య జనంలో ఆయనకు 50శాతం మద్దతు లభించింది. కానీ మోదీకి అన్ని వర్గాల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ ఉంది. 2017లో ప్రాథమిక పాఠశాల దాటని వారిలో 66 శాతం మంది మద్దతు మోదీకి లభించిందని పత్రికలో తెలిపింది. అదే సమయంలో ఎంతో కొంత ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో 80శాతం మంది మద్దతు ఆయనకు లభించిందని పేర్కొంది. '2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌నీతి జరిపిన సర్వేలో డిగ్రీ చదివిన వారిలో 42 శాతం మంది మోదీకి మద్దతుగా నిలిచారు. అదే ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారిలో 35శాతం మంది మద్దతు ఉంది. ఉన్నత స్థాయి వర్గాల మద్దతు పొందే క్రమంలో మోదీ సామాన్యుల మద్దతును కోల్పోలేదు' అని ఎకనామిస్ట్‌ వివరించింది.

ఆర్థికమే ప్రధాన కారణం
ఆర్థిక వ్యవస్థే మోదీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమని ఎకామిస్ట్ పత్రికలో వివరించింది. 'సమాజంలో పంపిణీ విషయంలో అసమానతలున్నప్పటికీ భారత్‌ ఘనమైన జీడీపీ వృద్ధి రేటు సాధించడం, భారత్‌లోని ఎగువ మధ్య తరగతి వారి సంఖ్య, ఆదాయాలు పెరగడమూ మోదీపై ఆదరణకు కారణాలే. 2000 సంవత్సరం సమయంలో ఎగువ మధ్య తరగతిలో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఆదరణ ఉండేది. ఆ తరువాత జరిగిన కుంభకోణాలతో 2010 వచ్చే సరికి కాంగ్రెస్‌కు వారి నుంచి మద్దతు కరవైంది. మోదీ హయాంలో భారత్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, అంతర్జాతీయంగా రాజనీతి ప్రదర్శించడం వల్ల ఫలితాలు కనిపించాయి. దీంతోపాటు ఆసియాలో టైగర్లుగా పరిగణిస్తున్న చైనా, తూర్పు దేశాలకు గట్టిగా ఎదురు నిలిచారు. దీంతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే మోదీ లాంటి నేత కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం మోదీ రూపంలో అటువంటి గట్టి నేత వచ్చారని వారంతా భావిస్తున్నారు' అని పత్రికలో పేర్కొంది.

కేజ్రీవాల్‌ వ్యవహారంతో ఇబ్బందే
ముఖ్యంగా కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారం ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చు. చాలా మంది ఉన్నత స్థాయి వర్గాల వారు ఇప్పటికీ తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామని అంటున్నారు. మోదీకి ప్రత్యామ్నాయ నేత వచ్చే వరకూ ఉన్నత వర్గాల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చు. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ పట్ల వారికి పెద్దగా ఆశల్లేవు. గట్టి ప్రతిపక్షం వచ్చే వరకూ మోదీకి ఇబ్బంది లేనట్లే' అని ఎకనామిస్ట్‌ వివరించింది.

నోటాకు ఓటేస్తే ఏమవుతుంది? ఈ ఆప్షన్ హిస్టరీ తెలుసా? - NOTA Option In Elections

పేద విద్యార్థికి ఐటీ షాక్- రూ.46కోట్లకు పన్ను కట్టాలని నోటీసులు- చివరకు! - Income Tax Notice To Poor Student

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.