ETV Bharat / bharat

లోక్​సభ స్పీకర్​ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఓటింగ్ ఉంటుందా? రూల్స్​ ఏం చెబుతున్నాయి? - Lok Sbha Speaker Election Process - LOK SBHA SPEAKER ELECTION PROCESS

Lok Sbha Speaker Election Process : దేశ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగబోతోంది. ఓం బిర్లా (ఎన్​డీఏ కూటమి), కె సురేశ్ (ఇండియా కూటమి) తలపడుతున్న ఈ ఎన్నిక ఎలా జరగబోతోంది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే వ్యవస్థ ద్వారా ఎంపీలు ఓట్లు వేస్తారా? పేపర్ స్లిప్పుల ద్వారా ఓట్లు వేస్తారా? అనే దానిపై చర్చ జరుగుతోంది.

Lok Sbha Speaker Election Process
Lok Sbha Speaker Election Process (Lok Sabha TV/ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 7:01 PM IST

Lok Sbha Speaker Election Process : లోక్‌సభ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక బుధవారం(జూన్ 26న) జరగబోతోంది. ఇప్పటివరకు లోక్‌సభలో ఈ తరహా ఎన్నిక జరగలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నిక సందర్బంగా ఇద్దరు అభ్యర్థులు ఓం బిర్లాకు (ఎన్​డీఏ కూటమి), కె సురేశ్​కు (ఇండియా కూటమి) పోల్ అయ్యే ఓట్ల లెక్కింపునకు విపక్షాలు సభలో పట్టుబట్టే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈసారికి ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే వ్యవస్థ ద్వారా ఓటింగ్ నిర్వహించే దాఖలాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఇంకా లోక్‌సభ సభ్యులకు సీట్ల నంబర్ల కేటాయింపు జరగలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సీట్ల నంబర్లు లేకుండా!
ఎంపీలకు కనీసం సీట్ల నంబర్లు లేకుండా ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే వ్యవస్థ ద్వారా ఓటింగ్ నిర్వహించడం అనేది సాధ్యపడకపోవచ్చని, ఈసారికి స్పీకర్ ఎన్నికకు పేపర్ స్లిప్పుల ద్వారా ఓట్లు వేసే పద్ధతినే వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యాంగ నిపుణుడు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ (272 స్థానాలు) ఉంటే, కేవలం ఏకగ్రీవ తీర్మానంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. దీని ఫలితం వెంటనే వచ్చేస్తుంది. ప్రస్తుతం సభలో ఏ పార్టీకి కూడా ఒంటరిగా 272 సీట్ల బలం లేనందున, పేపర్ స్లిప్పుల ద్వారా సేకరించే ఓట్లన్నీ లెక్కించి, ఫలితాన్ని ప్రకటించేందుకు కొంత సమయం పట్టొచ్చని పీడీటీ ఆచారి తెలిపారు.

'సభకు తప్పక హాజరుకండి'- ఎంపీలకు కాంగ్రెస్ విప్
స్పీకర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరికీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా తప్పకుండా బుధవారం ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభ సమావేశం ముగిసే వరకు సభలోనే అందుబాటులో ఉండాలని నిర్దేశించింది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలకు మద్దతుగా నిలవాలని తమ ఎంపీలకు సూచించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ కె సురేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈయనే ప్రస్తుతం ఇండియా కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగానూ పోటీ చేస్తుండటం గమనార్హం.

ఓం బిర్లా Vs సురేశ్- 100 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన వ్యక్తితో పోటీ- ఇండియా అభ్యర్థి గురించి తెలుసా? - LS Speaker Om Birla VS K Suresh

చరిత్రలో తొలిసారిగా స్పీకర్​ పదవికి ఎన్నికలు - మద్దతుకు విపక్షాలు నో! - Parliament Session 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.