ETV Bharat / bharat

అనేక మంది ప్రాణాలు కాపాడిన టీ అమ్మే వ్యక్తి- రైలు ప్రమాదంలో ఆయనే రియల్ హీరో! నక్సలైట్లపైనా అనుమానాలు!! - Latehar Train Accident - LATEHAR TRAIN ACCIDENT

Train Accident In Jharkhand : ఝార్ఖండ్‌లో రాంచీ- సాసారం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటనలో పలు విషయాలు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. అసలు మంటలు చెలరేగాయన్న వదంతులు ఎవరు వ్యాపించారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు ప్రాణాలను కాపాడాడు ఓ టీ అమ్మే వ్యక్తి.

Train Accident In Jharkhand
Train Accident In Jharkhand (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 5:57 PM IST

Train Accident In Jharkhand : ఝార్ఖండ్​ రైలు ప్రమాదంలో ఓ టీ అమ్మే వ్యక్తి చాలా మంది ప్రయాణికులను కాపాడాడు. ఘటన సమయంలో ప్రయాణికులను హెచ్చరించకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగి ఘోర ప్రమాదం జరిగిఉండేది. దీంతో టీ అమ్మే వ్యక్తిని రియల్​ హీరో అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక నక్సలైట్లు ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆ వ్యక్తి లేకపోతే
రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతలు నమ్మి కొందరు ప్రయాణికులు దూకేసి భయంతో పరుగులు తీశారు. అదే సయమంలో అటు నుంచి వస్తున్న గూడ్స్‌ రైలు ఢీకొని వారిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే ఆ సయమంలో గూడ్స్‌ రైలును గమనించిన టీ అమ్మే వ్యక్తి ఆ ట్రాక్ మీద నుంచి కొందరిని పక్కకు లాగాడు. ట్రాక్‌పై ఉన్నవారిని అతను పక్కకు తోసేశాడని, అలా చేయడం వల్లే తాము బతికిపోయామని ఓ ప్రయాణికురాలు తెలిపారు. అలాగే టీ అమ్మే వ్యక్తి చాలామందిని ఆ ట్రాక్‌పైకి వెళ్లకుండా అడ్డుకున్నాడని లేకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని వాపోయారు. టీ అమ్మే వ్యక్తి కూడా రాంచీ నుంచి ససారం వెళ్తున్నాడు. చాలా మంది ప్రయాణికులకు తమ ప్రాణాలను ఎవరు కాపాడారో కూడా తెలీదు. అయితే అతను టీ విక్రేతని వారికి తర్వాత తెలిసింది.

అనేక ప్రశ్నలు
మరోవైపు కుమండిహ్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఒక పుకారే మూడు ప్రాణాలు బలిగొందని రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వాటిని ఎవరు వ్యాప్తి చేశారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రమాదం జరిగిన స్థలం నక్సల్స్ ప్రభావితమైన ప్రాంతంగా గుర్తించారు. అయితే దీనివెనక నక్సలైట్ల పాత్ర ఏమైనా ఉందా? వారే ఈ పుకారును వ్యాప్తి చేశారా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదం జరిగిన కుమాండిహ్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గతంలోనూ అనేక నక్సలైట్ల దాడులు జరిగాయి. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. లతేహర్-బర్వాది రైల్వే స్టేషన్ మధ్య దట్టమైన అటవీ ప్రాంతం ఉందని, ఇదీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పరిగణిస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోనే రైలు ఆగిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతానికి రోడ్డు మార్గంలో చేరుకోవడం పెద్ద సవాలని తెలిపారు.

గతంలోనూ దాడులు
ఈ ప్రమాదం జరిగిన స్థలంలో గతంలో అనేక దాడులు జరిగాయి. కుమండిహ్ రైల్వే స్టేషన్‌పై నక్సలైట్లు పలుమార్లు దాడి చేశారు. ఈ దాడుల్లో రైల్వే ట్రాక్‌లు, భవనాలు దెబ్బతిన్నాయి. 2008-09లో హెహెగడ రైల్వే స్టేషన్‌లో మావోయిస్టులు రైలుపై దాడి చేశారు. ఈ పరిధిలో 2006-2016 మధ్య సుమారు 20 నక్సలైట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు పోలీసు సిబ్బంది అమరులయ్యారు. నక్సలైట్లు 15సార్లకు పైగా రైల్వే ట్రాక్లను పేల్చేశారు. 2016-17లో చివరిసారిగా ఇక్కడ నక్సలైట్లు దాడి చేశారు.

అసలేం జరిగిందంటే
ఝార్ఖండ్‌లో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాంచీ- సాసారం ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయంటూ విపరీతంగా వదంతులు రేగాయి. దీంతో కొందరు చైన్ లాగి ట్రైన్ ఆగేలా చేశారు. ఆ తర్వాత కుమండీహ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు నుంచి దిగిపోయారు. పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై నిల్చున్నారు. అదే సమయంలో దూసుకొచ్చిన గూడ్స్‌ రైలు వారిని ఢీకొంది. దీంతో ముగ్గురు చనిపోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురిలో ఇద్దరిని గుర్తించిన రైల్వే అధికారులు మూడో వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్​కౌంటర్- 8మంది నక్సలైట్లు హతం

అదుపుతప్పి అలకనంద నదిలో పడ్డ వెహికల్- 12మంది మృతి- అనేక మందికి గాయాలు - Vehicle Fell Into River

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.