How to Prepare Natu Kodi Pulusu: నాటుకోడి పులుసు.. ఈ పేరు వింటే చాలా మంది నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. నిజానికి దీని టేస్ట్ వేరే లెవల్. కూర, వేపుడు, పులుసు, పలావ్, బిర్యానీ ఏది చేసినా రుచి అద్దిరిపోవాల్సిందే. అలా తింటుంటే ఇలా నోట్లోకి జారుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడా.. బ్రాయిలర్ కోళ్లు అలవాటు అయ్యి.. నాటుకోళ్లను పక్కకు పెడుతున్నారు కానీ.. సరైన రీతిలో వండుకుని తింటే నాటుకోడి మజానే వేరు. పైగా ఇప్పుడు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ టైంలో నాటుకోడి తింటే.. "ఆహా" అనాల్సిందే. వండటం మాకు రాదు అంటారా? టెన్షన్ అక్కర్లేదు. ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. ఈ పద్ధతిలో కుక్ చేస్తే ఇక మీకు తిరుగుండదు. మరి లేట్ చేయకుండా రెసిపీ చదివేయండి..
నాటుకోడి పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- నాటుకోడి ముక్కలు - 1 kg
- పసుపు - అర టేబుల్ స్పూన్
- నూనె - సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లం వెల్లులి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- ధనియాలు - రెండు టేబుల్ స్పూన్లు
- లవంగాలు - 8
- యాలకలు - 5
- దాల్చిన చెక్క - కొద్దిగా
- ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు
- గసగసాలు - 1 టేబుల్ స్పూన్
- బిర్యానీ ఆకు - 2
- మిరియాలు - అర టీ స్పూన్
- కారం - రుచికి సరిపడా
- ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్)
- కరివేపాకు - 2 రెబ్బలు
- పచ్చిమిర్చి - 3
- వేడినీళ్లు - ముప్పావు లీటర్
- టమాటలు - 2
- నిమ్మకాయ - 1
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటలు సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయను పిండి రసాన్ని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులో నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. ఆ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్, కొద్దిగా నూనె వేసి.. ముక్కలకు పట్టించి కనీసం 3 గంటలైనా నానబెట్టాలి.
- మూడు గంటల తర్వాత మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి.. ధనియాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి మంట సిమ్లో పెట్టి మసాలాలు మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించాలి. ఆ తర్వాత గసగసాలు వేసి ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.
- మసాలాలు పూర్తిగా చల్లారిన మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టి.. ఆరు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి పచ్చి వాసన పోయి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
వీకెండ్ స్పెషల్ - చింతచిగురు మటన్ ! ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!
- ఆ తర్వాత అందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి.
- ఆ తరువాత సరిపడా కారం వేసి కొద్దిగా నీళ్లు వేయించుకోవాలి. నీళ్ల పోసి వేపితే కారం మాడదు.
- కారం మగ్గి.. నూనె పైకి తేలిన తరువాత మూడు గంటలు నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి.
- ఓ పది నిమిషాల తర్వాత ముక్కలు ఉడికి.. నూనె పైకి తేలిన తరువాత ముప్పావు లీటర్ వేడి నీళ్లు పోసి కలిపుకుని.. ఆ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా వేసుకోవాలి.
- ఆ తర్వాత మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ముక్క మెత్తబడేదాకా ఉడికించుకోవాలి.
- సుమారుగా 35 నుంచి 40 నిమిషాలు చికెన్ 80% ఉడుకుతుంది(ఒకవేళ చికెన్ ఎక్కువ తీసుకుంటే టైమ్ ఎక్కువ పడుతుంది). ఆ తర్వాత ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసి కలిపి మూతబెట్టి నూనె పైకి తేలేదాకా ఓ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి
- నూనె పైకి తేలిన తరువాత చివరగా నిమ్మకాయ రసం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవడమే.
- అన్నంతో అయినా సరే.. జొన్న రొట్టె, చపాతీ, గారెలు.. ఇలా కాంబినేషన్ ఏదైనా సరే.. అద్భుతమైన రుచిని ఆస్వాదించడం గ్యారెంటీ.
సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే!
చికెన్ రెగ్యులర్గా వండేస్తున్నారా? - ఈ సండే ఇలా చేయండి - కమ్మగా, కారంగా!