How to Make Pudina Rasam : బయట వర్షం.. ఇంట్లో కూర్చుంటేనేమో చలి! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది. అయితే ఈ కూల్ వెదర్‌లో చాలా మంది వేడి వేడి అన్నంలో చారు పోసుకుని తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక చారు అంటే.. టమాటా, మిరియాలతో చేసినవే గుర్తుకువస్తాయి. అయితే ఈ సారి అవి కాకుండా.. పుదీనా చారు ట్రై చేయండి. దీని టేస్ట్ అమృతంలా ఉంటుంది. అంతేనా ఈ కూల్ వెదర్‌లో తింటుంటే గొంతులోకి జప్పున జారుతుంది. మరి దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్ధాలు :
చారు పౌడర్ కోసం :
- ఎండు మిర్చి-3
- జీలకర్ర- టీస్పూన్
- ధనియాలు- టేబుల్‌స్పూన్
- కందిపప్పు- టీస్పూన్
- మిరియాలు-టీస్పూన్
- నూనె-అర టీస్పూన్
రసం కోసం :
- చిక్కటి చింత పండు రసం - 100 ml
- నీళ్లు - 400ml
- పసుపు- పావు టీస్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- మెత్తగా ఉడికించుకున్న కందిపప్పు- అరకప్పు
- పుదీనా ఆకులు తరుగు- కప్పు
తాలింపు కోసం :
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ఆవాలు - అర టీ స్పూన్
- ఎండుమిర్చి-2
- ఆయిల్- టేబుల్‌స్పూన్
- ఇంగువ - చిటికెడు
పుదీనా రసం తయారీ విధానం :
- ముందుగా స్టౌ ఆన్ చేసి పాన్‌లో ధనియాలు, మిరియాలు, కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేయండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి వాటిని ఎర్రగా వేపుకోండి.
- ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో చింత పండు రసం పోసుకోండి. అలాగే అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, వాటర్, ముందే ప్రిపేర్ చేసుకున్న చారు పొడి వేసి కలుపుకుని మంట సిమ్‌లో పెట్టి ఓ పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత రసంలో మెత్తగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకుని కలిపి మూత పెట్టాలి.
- ఇప్పుడు బాగా మరుగుతున్న చారులో పుదీనా ఆకులు వేసి మూత పెట్టి.. లో ఫ్లేమ్‌లో ఓ మూడు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. అది హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకుని.. చారులో కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో టేస్టీగా, ఘాటుగా ఉండే పుదీనా చారు రెడీ.
- ఈ చారుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. నచ్చితే, మీరూ ఓ సారి పుదీనా చారు ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్‌లా తాగేయొచ్చు!
సూపర్ రెసిపీ : మసాలా ఎగ్ బుర్జీ - నషాళానికి తాకాల్సిందే!
బ్రెడ్‌తో స్పైసీ స్పైసీ వంటలు- తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!