ETV Bharat / bharat

డబ్బు సంపాదించడానికి - ధనవంతులు అనుసరించే 10 మార్గాలు ఇవే! - how to rich in telugu

How To Become Rich : డబ్బు బాగా సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ.. కొందరికే సాధ్యమవుతుంది! మరి.. వారికి మాత్రం ఎలా సాధ్యమవుతుంది? అంటే.. వారు కొన్ని మార్గాలను అనుసరిస్తారని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు! అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

How To Become Rich
How To Become Rich
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 2:28 PM IST

How To Become Rich : కోటీశ్వరులుగా లగ్జరీ కార్లలో తిరగాలని.. పెద్ద విల్లాలో నివాసం ఉండాలని.. లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని అందరూ కలగంటారు. కానీ.. కొందరు మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. ఈ కొద్ది మందికి ఎలా సాధ్యమంటే.. వారు కొన్ని పద్ధతులు పాటిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

శ్రీమంతులు ధనవంతులుగా మారడానికి అనుసరించిన 10 మార్గాలు :

ఖర్చులు తగ్గించుకోవడం : ధనవంతులుగా మారడానికి ముందుగా ఎక్కువ మంది శ్రీమంతులు వారి ఖర్చులను తగ్గించుకుంటారు. అది ఎలా అంటే వారికి అవసరమైన వస్తువులను మాత్రమే వారు కొంటారు. మిగతా అనవసరమైన వాటికి దూరంగా ఉంటారు.

ఆదాయ వనరులను పెంచుకోవడం : శ్రీమంతుల దగ్గర కోట్లాది రూపాయలు ఉండటానికి కారణం వారికి ఒకటి కంటే ఎక్కువగా ఆదాయ మార్గాలు ఉండటమే. మీరు కూడా ధనవంతులు కావాలనుకుంటే ఒకటి కంటే ఎక్కువగా ఆదాయ మార్గాలను చూసుకోవాలి.

ఆర్థిక వృద్ధిని గమనిస్తూ ఉండటం : ఈ ప్రపంచంలోని చాలా మంది ధనవంతులు డబ్బుతో చక్రం తిప్పడానికి కారణం.. వారు ఎప్పటికప్పుడూ తమ ఆర్థిక పురోగతి గమనిస్తూ ఉండమేనని నిపుణుంటున్నారు. వారు తమకంటూ ఒక గమ్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా ముందుకు సాగుతున్నామా లేదా..? అనే విషయాన్ని చెక్‌ చేసుకుంటారు.

రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా : మనం చేసే ప్రతి పనిలోనూ ఎంతో కొంత రిస్క్‌ ఉంటుంది. అయితే, ఈ రిస్క్‌ను చూసి బయపడకుండా శ్రీమంతులు ఎంతో జాగ్రత్తగా ముందడుగు వేస్తారు. వారు ఎల్లప్పుడూ రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు.

డబ్బును అర్థం చేసుకోవడం : కోటీశ్వరులు కావాలంటే ముందుగా డబ్బు విలువను అర్థం చేసుకోవాలని చాలా మంది శ్రీమంతులు చెబుతున్న మాట. అది ఎలా అంటే పొదుపు చేసిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే అది డబుల్‌ అవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఇది ఒక్కటి తెలిస్తే చాలు మీ డబ్బే డబ్బును సంపాదిస్తుంది.

సరైన ఆర్థిక సలహా పొందడం : శ్రీమంతులు ఎల్లప్పుడూ డబ్బు సంబంధిత విషయాలలో అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి మంచి సలహాలు, సూచనలను తీసుకుని సరైన నిర్ణయాలను తీసుకుంటారు. దీనివల్ల వారు ఇతర రంగాల్లో అనుభవం లేకపోయినా కూడా రిస్క్‌ తీసుకుని పెట్టుబడి పెట్టి లాభాలను పొందుతారు.

ఓపికతో ఉండటం : ఈ ప్రపంచంలో ఉన్న చాలా మంది ధనవంతులకు అంత డబ్బు ఒక్క రాత్రిలో రాలేదు. వారు సరైన ప్రణాళికతో వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి ఎంతో కాలం వేచి చూసిన తర్వాత ఆ స్థాయికి వెళ్లారు. కాబట్టి, ధనవంతులు కావడానికి చాలా ఓపిక ఉండాలి.

సానుకూల దృక్పథం : ధనవంతులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సానుకూల దృక్పథంతో అవకాశాలుగా మార్చుకుంటారు. దీంతో వారు విజయానికి ముందు వచ్చే ఆటంకాలను దాటుకుంటూ లక్ష్యాలను చేరతారు.

పొదుపు చేయాలి : శ్రీమంతులు కావాలంటే మన ఆదాయంలో కొంత మొత్తాన్ని తప్పక పొదుపు చేయాలి. ఉదాహరణకు మీకు రూ.10,000 సంపాదిస్తున్నారని అనుకుంటే, అందులో కనీసం ఒక రూ.2000 తప్పక పొదుపు చేయాలి. అలా కాకుండా.. మీ ఆదాయాన్ని మించి అంటే రూ.15,000 వరకు ఖర్చు చేస్తుంటే ఎప్పటికీ ధనవంతులు కాలేరు.

పెట్టుబడి పెట్టడం : ధనవంతులు తాము పొదుపు చేసిన డబ్బును ఎక్కువగా లాభాలను అందించే షేర్‌ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడతారు. దీనివల్ల వారి డబ్బు త్వరగా రెట్టింపవుతుందని నిపుణులంటున్నారు.

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ ఉంది? - వాస్తు ప్రకారం ఏ దిశలో ఉండాలో తెలుసా?

ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? పన్ను ఆదా కావాలా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.