Optical Illusion Test for Your Eyes : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫైండ్ ది డిఫరెన్స్, స్పాట్ ది డిఫరెన్స్ ట్రెండ్ నడుస్తోంది. వివిధ రకాల బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. పిక్చర్స్‌కు సంబంధించిన తేడాలు గుర్తించే వాటిని నెటిజన్లు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. వాటిని సాల్వ్ చేస్తూ వర్క్ టెన్షన్స్ నుంచి రిలీఫ్ పొందుతున్నారు. అయితే ఈ బ్రెయిన్ టీజర్లు మెదడుకు పదును పెట్టడమే కాదు.. క్రియేటివ్‌గా ఆలోచించేలా ప్రోత్సహిస్తూ, విజన్, మెమరీ పవర్, తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి. సీక్రెట్ కోడ్స్, ఫైండ్ ది డిఫరెన్స్, పిక్చర్స్‌లో దాగిన వస్తువులను గుర్తించడం వంటి ఎన్నో పజిల్స్ మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయని.. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని నిపుణులు అంటున్నారు. మరి మీరు కూడా మీ ఐక్యూ పవర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఓ పజిల్ తీసుకొచ్చాం..
మీకు కనిపించే రెండు ఫొటోల మధ్య ఆరు తేడాలు ఉన్నాయి. అయితే అందులోని తేడాలను కనిపెట్టడానికి మీకు ఇస్తున్న సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే. ఇప్పుడే స్టార్ట్ చేయండి డిఫరెన్స్ కనుక్కోవడం..
ఏంటీ మీకు ఎంత వెతికినా బొమ్మల మధ్య ఉన్న అన్ని తేడాలు కనిపించడం లేదా? అయితే, సమాధానాల కోసం ఒకసారి కింది ఫొటోపై లుక్కేయండి. అంతేకాకుండా మీరు గమనించినవి, మేము చెప్పిన ఆన్సర్లు ఒకటో కాదో చెక్ చేసుకోండి. ఎక్కడ మిస్టేక్ చేశారో గమనించండి. దాన్ని బట్టి మీ ఐ రేంజ్, ఆలోచించే విధానం ఎలా ఉందో చెప్పవచ్చు. అయితే ఇచ్చిన టైమ్‌లో సాల్వ్ చేసిన వారికి పదునైన చూపు, వేగంగా, చురుకుగా పనిచేసే బ్రెయిన్ ఉందని చెప్పవచ్చు. తేడాలను గుర్తించలేకపోయిన వారు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్‌ను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా పజిల్స్ సాల్వ్ చేయడంలో తోపులవుతారు. సో ఈసారికి ఆల్ ది బెస్ట్..
సమాధానాలు ఇవే..
1. అబ్బాయి జుట్టు
2. సోఫా
3. నిచ్చెన
4. చెట్టు ఆకు
5. గొడుగు
6. చొక్కా
ఈ పిక్చర్లో 6 తేడాలున్నాయి - 8 సెకన్లలో కనిపెడితే మీరు తోపులంతే! - Difference Between two pictures