Dos And Don'ts For Aadhaar Card Holders : దేశంలో ఆధార్ కార్డ్‌కు ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందడం నుంచి.. స్కూల్, కాలేజీ అడ్మిషన్లు, సిమ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ వరకు.. ఇలా ఎన్నో పనులకు ఆధార్ కార్డ్ అనివార్యం అయిపోయింది. ఇంతటి ముఖ్యమైన ఆధార్ వివరాలు చోరీ చేసి కేటుగాళ్లు పలు అక్రమాలకు పాల్పడుతున్నారు.
అందుకే.. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది అజాగ్రత్తగా ఉండడం వల్ల.. సైబర్ నేరగాళ్లు ఈజీగా ఆధార్ వివరాలను సంపాదిస్తున్నారని చెబుతున్నారు. మీ ఆధార్ వివరాలు సేకరించి.. మీ పేరు మీద సిమ్ కార్డులు తీసుకోవడం, మీ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం వంటివి చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. అందుకే.. అందరూ ఆధార్ డీటెయిల్స్ సేఫ్‌గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఆధార్ కార్డ్ విషయంలో చేయాల్సిన, చేయకూడని పనుల గురించి వివరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఆధార్ కార్డ్ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు..
- ప్రతి ఆరు నెలలకు ఒకసారి UIDAI వెబ్‌సైట్ లేదా m-Aadhaar యాప్‌లో మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని కచ్చితంగా చెక్ చేయండి.
- మీ ఆధార్ కార్డ్‌కు ఈ-మెయిల్ ఐడీని లింక్ చేయండి. దీనివల్ల మెయిల్ నుంచి అథెంటికేషన్ సమాచారాన్ని పొందవచ్చు.
- అలాగే మీ ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయండి. దీని ద్వారా OTP సేవలను పొందవచ్చు. అప్పుడు ఎవరైనా మీ ఆధార్‌ను ఉపయోగించాలని చూస్తే.. మీకు OTP వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే వారికి యాక్సెస్ లభిస్తుంది. కాబట్టి.. అందరూ మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
- ఆధార్ కార్డ్‌లో మన వేలి ముద్రలు, ఫొటో, ఐరిస్ స్కాన్ వంటి ఎన్నో వ్యక్తిగత విషయాలుంటాయి. కాబట్టి, మీరు ఎవరికైనా తెలియని వ్యక్తులకు ఆధార్ కార్డ్‌ను ఇచ్చే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి.
- మీ ఆధార్ కార్డ్‌ను బయోమెట్రిక్ లాకింగ్ చేసుకోండి. లాక్ చేసిన తర్వాత.. మీరు ఎక్కడైనా వేలి ముద్రలు వేయాలంటే.. ముందుగా బయోమెట్రిక్‌ను ఆన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ ఆధార్ సురక్షితంగా ఉంటుంది.
- ఒకవేళ మీ ఆధార్ కార్డ్‌ను ఎవరైనా అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు అనుమానం కలిగితే వెంటనే UIDAI టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1947 ను సంప్రదించండి. ఇది 24*7 అందుబాటులో ఉంటుంది.
- లేదా help@uidai.gov.inకు ఇమెయిల్ పంపండి.
ఆధార్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయవద్దు..
- మీ ఆధార్ PVC కార్డ్ జాగ్రత్తగా మీ వద్దే ఉంచుకోండి. ఎక్కడా పడేయవద్దు.
- మీ ఆధార్ కార్డ్‌ను Facebook, Instagram, whatsapp, ట్విట్టర్ (X) వంటి పబ్లిక్ డొమైన్‌లో పోస్ట్ చేయకూడదు.
- అలాగే ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉన్న నెంబర్‌కు వచ్చే OTPలను ఎవ్వరికీ షేర్ చేయవద్దు.
- మీ m-Aadhaar PINను ఎవరితోనూ పంచుకోవద్దు.
ఆధార్ కార్డుతో యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు! ఇకపై ఏటీఎం కార్డు అవసరం లేదు!!