ETV Bharat / bharat

మీ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 3:07 PM IST

Dog Owners Mistakes: మీరు డాగ్స్​ పెంచుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే మీరు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెట్స్​.. చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Dog
Dog

Dog Owners Make Common Mistakes: ఇటీవల కాలంలో ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకోవడం ఒక ట్రెండ్​గా మారింది. అయితే చాలా మంది వాటిలో ఎక్కువగా కుక్కలను పెంచుకుంటుటారు. ఇంట్లో ఓ మెంబర్​గా వాటిని ట్రీట్​ చేస్తున్నారు. నిజానికి పెట్స్​ను పెంచుకోవడం వల్ల మనకు ఎప్పుడైనా మనసు బాగోలేకపోయినా, బోర్ కొట్టినా.. వాటితో కాసేపు ఆడితే మంచి రిలాక్సేషన్ లభిస్తోంది. అయితే చాలా మంది వాటి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. కుక్కే కదా అని ఎలా పడితే అలా పెంచుతూ కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇంతకీ, యజమానులు చేసే ఆ తప్పులేంటి.. వాటి వల్ల జరిగే నష్టాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తగిన సమయాన్ని కేటాయించకపోవడం : నేటి బిజీ బిజీ లైఫ్​లో చాలా మంది పెట్స్ కోసం తగిన సమయం కేటాయించడం లేదు. కానీ, అలా కాకుండా మీరు వాటి కోసం కొంత సమయం కేటాయించమంటున్నారు నిపుణులు. అందుకోసం కాసేపు వాటిని బయటకు తీసుకెళ్లడం, వాటికి కొంత స్వేచ్ఛ ఇవ్వడం లాంటివి చేయాలంటున్నారు. అలా కాకుండా ఎప్పుడూ కట్టేసి ఉంచితే వాటి కండరాలలో ఎదుగుదల నశిస్తుంది. ఫలితంగా అవి ఎదగకపోవడం అటుంచితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు.

ఒంటరిగా వదిలివేయవద్దు : పని, ప్రయాణాల దృష్ట్యా చాలా మంది తాము పెంచుకుంటున్న పెట్స్​ను​ ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి వెళుతుంటారు. కానీ, అన్ని సార్లు అలా వదిలేసి వెళ్లడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకుంటే అలా చేయడం వల్ల వాటి మానసిక ఎదుగదల తగ్గిపోతుంది. అలాగే యాక్టివ్​గా ఉండకుండా స్తబ్దుగా ఉంటాయి. అందువల్ల వాటిని ఇంట్లో వదిలేసి వెళ్లే సమయంలో బొమ్మలు ఇవ్వడం లాంటివి చేయమంటున్నారు. వీలైతే డాగ్​ కేర్​ సెంటర్లో వదిలిపెట్టమంటున్నారు. ఇకపోతే కొన్ని డాగ్స్ మాత్రం ఒంటరిగా ఉండడానికి అనువైనవిగా ఉంటాయి. అందుకోసం వాటికి సౌకర్యవంతమైన, సురక్షితమైన స్థలం ఏర్పాటు చేయాలి. కావాల్సిన ఆహారం కూడా అందుబాటులో ఉంచాలి.

వ్యాయామం లేకపోవడం : కుక్కలు శారీరకంగా చురుకైన జంతువులు. కాబట్టి మనం శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ విధంగానైతే రోజూ వ్యాయామం చేస్తామో.. అలాగే వాటికి డైలీ తగిన వ్యాయామం చేయించడం అవసరం. అయితే ప్రతి కుక్క వ్యాయామ అవసరాలు భిన్నంగా ఉన్నప్పటికీ రోజూ కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటికి తగిన శారీరక శ్రమ లేకపోతే అవి బరువు పెరగడం, శారీరక సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

తగినంత ఆహారం అందించకపోవడం : కుక్క ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే వాటికి అందించే ఆహారం విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఏ ఫుడ్ పడితే అది పెడుతుంటారు. ఫలితంగా అవి పోషకాహార లోపంతో అనారోగ్యానికి గురవుతుంటాయి. కాబట్టి కుక్కల జాతి, వయసు, శారీరక స్థితిని బట్టి వాటి ఆరోగ్య అవసరాలకు తగిన ఆహారాన్ని నిర్ణయించడానికి పశువైద్యుడిని సంప్రదించాలి. వారు సూచించిన ప్రకారం ఆహారం అందించడం బెటర్.

వైద్య సంరక్షణలో నిర్లక్ష్యం : ఇక కుక్కలను పెంచుకునే యజమానులు చేసే మరో సాధారణ తప్పు ఏంటంటే.. వాటి వైద్య సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం. అవి అనారోగ్యానికి గురైనప్పుడు తగిన సమయంలో వాటికి ట్రీట్​మెంట్ అందించకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు పెంచుకుంటున్న కుక్కల వైద్య సంరక్షణ చాలా ముఖ్యం. అందుకోసం క్రమం తప్పకుండా వాటిని పరీక్షించడం, వ్యాక్సిన్ చేయించడం, అవసరమైనప్పుడు చికిత్స అందించాలి.

చిన్న వయసులోనే చర్మంపై ముడతలా? - కారణాలు ఇవేనట!

బరువు తగ్గడానికి వాకింగ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.