Delhi UPSC Coaching Center Incident : భారీ వర్షం కారణంగా సెంట్రల్ దిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు తెలంగాణ, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శనివారం సాయంత్రం ఓల్ట్ రాజిందర్ నగర్‌లోని ఓ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా పొటెత్తడం వల్ల భవనం అడుగు భాగం జలమయమైంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐఏఎస్ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని దిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి వెళ్లామని, అప్పటికే బెస్మెంట్ మొత్తం జలమయమై ఉన్నట్లు పేర్కొన్నారు. దిల్లీ అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్, స్థానికల పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాన్ని వెలికితీశామని తెలిపారు. ప్రమాద సమయంలో పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దిల్లీ పోలీసులు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
#WATCH | Old Rajender Nagar incident | Delhi: Rescue and search operations are underway at the IAS coaching centre in Old Rajender Nagar where three students lost their lives after the basement was filled with water.
— ANI (@ANI) July 28, 2024
(Morning visuals from the spot) pic.twitter.com/nlH2RAR4nW
విద్యార్థలు ఆందోళనలు
మరోవైపు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. '10 నిమిషాల పాటు వర్షం కురిసినా ఇక్కడ నీరు నిలిచిపోతుంది. గత 12 రోజులుగా డ్రైనేజీని శుభ్రం చేయాలని కౌన్సిలర్‌ను కోచింగ్ సెంటర్ యజమాని అడుగుతున్నానని అన్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్లు 8-10మంది వరకు చనిపోయారని అంటున్నారు. మృతుల సంఖ్య, ఎంతమంది గాయపడ్డారో మాకు తెలియజేయాలి' విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Old Rajender Nagar Incident | Delhi: Students continue to protest against the MCD and the coaching institute where three students lost their lives after the basement of the institute was filled with water yesterday pic.twitter.com/9Erd7TgOAt
— ANI (@ANI) July 28, 2024
#WATCH | Old Rajender Nagar incident | Delhi: A group of students staged a protest against the MCD outside the place where the basement of a coaching class was filled with water claiming the lives of three students pic.twitter.com/Siyk5C2nDP
— ANI (@ANI) July 27, 2024
#WATCH | Old Rajender Nagar incident | Delhi: " mcd says it is a disaster but i would say that this is complete negligence. knee-deep water gets logged in half an hour of rain. disaster is something that happens sometimes. my landlord told that he had been asking the councillor… pic.twitter.com/vEZna9TZcH
— ANI (@ANI) July 28, 2024
మేజిస్టీరియల్ విచారణకు ఆదేశం
ఈ ఘటనపై 24 గంటల్లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని దిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని ఎక్స్ వేదికగా అతిశీ పేర్కొన్నారు.
Delhi Minister Atishi tweets, " there is news of an accident due to heavy rain in delhi in the evening there is news of water filling in the basement of a coaching institute in rajendra nagar delhi fire department and ndrf are on the spot. delhi mayor and local mla are also… https://t.co/PKDiWkpm9u pic.twitter.com/TinbTsp6Q7
— ANI (@ANI) July 27, 2024
ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
ఘటనాస్థలిని సందర్శించిన దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్ పాలనపై విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజీలను శుభ్రం చేయించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అందుకు బాధ్యత వహించి మంత్రి ఆతిశీ, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని అన్నారు. ఇంకా 18మంది చిక్కుకొని ఉంటారని, కానీ అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని బీజేపీ నేత మంజీందర్ సిర్సా పేర్కొన్నారు.
వికసిత్ భారత్@2047 ప్రతి భారతీయుడి ఆశయం: మోదీ - NITI Aayog Meeting 2024