ETV Bharat / bharat

ఒక్క ట్రైన్ టికెట్ - 56 రోజుల వ్యాలిడిటీ - దేశం మొత్తం చుట్టేసి రావచ్చు! - Circular Journey Ticket Advantages

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 1:30 PM IST

Circular Journey Ticket Advantages : సాధారణంగా ఏదైనా ట్రైన్ టికెట్ తీసుకుంటే ఒకసారితో దాని గడువు ముగిసిపోతుంది. కానీ, ఇండియన్ రైల్వే అందిస్తోన్న ఈ స్పెషల్ ట్రైన్ టికెట్​తో.. ఏకంగా 56 రోజులపాటు రైల్లో జర్నీ చేయవచ్చని మీకు తెలుసా? మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

How To Book Circular Journey Ticket
Circular Journey Ticket (ETV Bharat)

How To Book Circular Journey Ticket : నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి ట్రైన్ జర్నీని ఎంచుకుంటుంటారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగడం అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, సాధారణంగా ఎవరమైనా రైలులో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు.. వెళ్లాల్సిన గమ్యానికి ఒక టికెట్, రావడానికి మరో టికెట్, ఇతర ప్రదేశాలకు వెళ్తే ఇంకో టికెట్ బుక్ చేసుకుంటాం. కానీ, ఇండియన్ రైల్వే(Indian Railway) అందిస్తోన్న "సర్క్యులర్‌ జర్నీ టికెట్" తీసుకుంటే.. ఒకే టికెట్ ద్వారా ఏకంగా 56 రోజుల పాటు రైలులో ప్రయాణించవచ్చు. అసలేంటి, ఈ టికెట్? దీనిని ఎలా బుక్ చేసుకోవాలి? ధర ఎలా లెక్కిస్తారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సర్క్యులర్‌ జర్నీ టికెట్ అనేది.. ఒక స్పెషల్ టికెట్. మీరు ఏ క్లాసులోనైనా దీన్ని తీసుకోవచ్చు. ఈ టికెట్‌లో గరిష్ఠంగా 8 జర్నీలు ఉంటాయి. అంటే.. ఒక చోట మీ జర్నీని స్టార్ట్ చేసి.. 56 రోజులపాటు దేశంలో ఎక్కడైనా తిరిగి.. మళ్లీ మీరు ప్రయాణం ప్రారంభించిన చోటుకు చేరుకోవచ్చు. అయితే.. మధ్యలో మీరు దిగే స్టేషన్ల సంఖ్య 8కి మించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక స్టేషన్​లో దిగి.. ఆ ప్రాంతంలో కొన్ని రోజులు గడిపి.. ఆ తర్వాత మరో ప్రదేశానికి మీ ప్రయాణాన్ని కంటిన్యూ చేయవచ్చు.

ఉదాహరణకు ఇలా చూద్దాం..

మీరు హైదరాబాద్‌ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లి రావడానికి టికెట్ తీసుకున్నారనుకుందాం. అప్పుడు హైదరాబాద్‌ నుంచి మొదలైన మీ జర్నీ.. చాలా స్టేషన్లు దాటుకుంటూ తిరుపతి రీచ్ అవుతుంది. ఆ టైమ్​లో మీరు తిరుపతిలో దిగి.. కొన్ని రోజులు అక్కడి సమీపంలోని ప్రదేశాలను చూసి.. మళ్లీ బెంగళూరుకు రైలు ఎక్కొచ్చు. మళ్లీ బెంగళూరు వెళ్లాక అక్కడ కొన్ని రోజులు గడపొచ్చు. ఆ తర్వాత.. చెన్నై వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి.. ఆపై మీ రిటర్న్ జర్నీ ప్రారంభించొచ్చు. అంతేకాదు.. తిరిగి హైదరాబాద్​కు చేరుకునే క్రమంలో.. మీరు ఎక్కడైనా దిగాలనుకుంటే.. అక్కడ దిగేయొచ్చు. అలాగే ఆ ప్రాంతం నుంచి రిటర్న్ జర్నీ కంటిన్యూ చేయవచ్చు. ఈవిధంగా.. రాకపోకల సమయంలో మీకు మొత్తం 8 చోట్ల దిగి, ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం.. ఏయే స్టేషన్లలో రైలు దిగుతారనేది సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే, 56 రోజుల లోపల మీ జర్నీ ముగించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మీరు రిజర్వ్ చేసుకున్న ట్రైన్​ సీట్లో మరొకరు కూర్చున్నారా? డోంట్​ వర్రీ - ఇలా చేస్తే ఆల్​ సెట్​!

సర్క్యులర్‌ జర్నీ టికెట్​ను ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

  • ఈ టికెట్ల కోసం రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ మేనేజర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.
  • వారు మీ ట్రైన్ జర్నీ ప్లాన్ ఆధారంగా టికెట్‌ ధరను లెక్కించి.. స్టేషన్ మేనేజర్​కు తెలియజేస్తారు.
  • అప్పుడు.. మీరు జర్నీ స్టార్ట్ చేసే స్టేషన్‌ బుకింగ్‌ ఆఫీసులో సర్క్యులర్‌ టికెట్‌ కొనుగోలు చేయాలి. మీ బ్రేక్‌ స్టేషన్లను కూడా అక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • అంతే.. మీ సర్క్యులర్‌ జర్నీ టికెట్‌ జారీ అవుతుంది.

ధరను ఎలా లెక్కిస్తారంటే?

  • టికెట్ చెల్లుబాటు వ్యవధి, జర్నీ చేసే రోజులు, విరామ ప్రయాణానికి సంబంధించిన రోజులన్నింటినీ లెక్కలోకి తీసుకొని టికెట్ ధరను నిర్ణయిస్తారు.
  • 400 కిలోమీటర్ల దూరానికి 1 రోజుగా లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా.. ప్రయాణం చేయని రోజును 200 కిలోమీటర్లుగా లెక్కిస్తారు.
  • అలాగే.. సీనియర్ సిటిజన్లకు కనిష్ఠంగా 1000 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే టికెట్ ధరపై సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
  • అదే.. పురుషులకైతే 40 శాతం, మహిళలకైతే 50 శాతం రాయితీ లభిస్తుంది.
  • ఈ సర్క్యులర్ జర్నీ టికెట్‌పై ప్రయాణికుడి సంతకం కచ్చితంగా ఉండాలి. దీని ధర.. సాధారణ టికెట్ తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. విహార యాత్రలకు వెళ్లే వారికి ఈ టికెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

అర్జెంట్​గా ట్రైన్​కు వెళ్లాలా? డోంట్ వర్రీ - 5 మినిట్స్​ ముందు కూడా టికెట్ బుక్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.