Centre Blocks 18 OTT Platforms : అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారనే కారణంతో 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, సామాజిక మాధ్యమ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ మేరకు 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సామాజిక మాధ్యమ ఖాతాలు భారత్‌లో పనిచేయకుండా బ్లాక్ చేసినట్లు కేంద్రం తెలిపింది. బ్లాక్ చేసిన యాప్‌ల్లో ఏడు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, మూడు యాపిల్ యాప్ స్టోర్‌లో ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రకటించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
-
The Ministry of Information & Broadcasting (I&B) has taken action in coordination with various intermediaries, to block 18 OTT platforms publishing obscene, vulgar, and, in some instances, pornographic content. 19 websites, 10 apps (7 on Google Play Store, 3 on Apple App Store),… pic.twitter.com/5BkRO3GWPy
— Press Trust of India (@PTI_News) March 14, 2024
అనేక సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 కింద వాటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. సృజనాత్మక వ్యక్తీకరణ పేరిట అశ్లీలతను వ్యాప్తి చేయరాదని ఆయన స్పష్టం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, మీడియాకు చెందిన నిపుణులు,మహిళలు, బాలల హక్కుల సంస్థలతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్‌బుక్‌లో 12, ఇన్‌స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌లో 16, యూట్యూబ్‌లో 12 ఉన్నట్లు చెప్పింది.
తొలగించిన ఓటీటీలకు కోటికిపైగా డౌన్‌లోడ్స్ ఉన్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇవి సోషల్ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్‌కు సంబంధించిన ట్రైలర్, దృశ్యాలు, వెబ్‌లింక్‌లను ప్రచారం చేస్తున్నాయని వివరించారు. ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు 32 లక్షల వీక్షణలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఓటీటీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా వెబ్‌సిరీస్‌లకు ఓటీటీ అవార్డులను ప్రవేశపెట్టామని అన్నారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాటిపై తప్పక చర్యలుంటాయని ప్రకటలో పేర్కొన్నారు. అంతకుముందు రెండు రోజుల క్రితమే దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు ఉంటాయని వెల్లడించారు.
సోషల్ మీడియాలో వారికి నో ఎంట్రీ - బిల్లు పాస్ చేసిన ప్రభుత్వం!
138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై నిషేధం.. కేంద్రం కీలక నిర్ణయం