A Labour Donate Bicycles To Students in Karnataka : రోజూ 3-4 కిలోమీటర్లు పాఠశాలకు నడిచి వెళ్లే విద్యార్థులకు ఓ యువకుడు సైకిళ్లు పంపిణీ చేశాడు. అది కూడా రోజువారి కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బును పొదుపు చేసి మరి సైకిళ్లను కొని విద్యార్థులకు ఇచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సైకిళ్లను స్టూడెంట్స్‌కు ఇచ్చి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడే కర్ణాటకకు చెందిన అంజినేయ యాదవ్.
రూ.40 వేలు పొదుపు
రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలుకాలోని మల్కందిన్ని గ్రామానికి చెందిన అంజినేయ యాదవ్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆ గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునేందుకు మాత్రమే స్కూల్ అవకాశం ఉంది. ఆ తర్వాత పైచదువుల కోసం సుమారు 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న యమనూరు హైస్కూల్‌కు వెళ్లాలి విద్యార్ఖులు. కొంత మంది సూడెంట్స్ ఇలా రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లడాన్ని గమనించాడు అంజినేయ. వాళ్లకు ఏదైనా సాయం చేయాలని అనుకున్నాడు. ఇలా కూలీగా పని చేసి వచ్చిన డబ్బును పొదుపు చేయటం ప్రారంభించాడు. అలా రూ.40 వేలు దాచి పెట్టి 11 సైకిళ్లు కొని గ్రామంలోని విద్యార్థులకు పంపిణీ చేశాడు అంజినేయ యాదవ్.
"రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు రవాణా వ్యవస్థ సరిగ్గా లేని కారణంగానే చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అలా చదువు మధ్యలోనే ఆగిపోకూడదని నేను అనుకుంటాను. మొదట నేను మా గ్రామంలోని విద్యార్థులు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లడం గమనించాను. వారికి నేను సాయం చేయాలని అనుకున్నాను. అందుకే సైకిళ్లు ఇచ్చాను."
- అంజినేయ యాదవ్, దినసరి కూలీ
కూలీ పని చేసుకుంటూ జీవించే అంజినేయ యాదవ్ విద్యార్థుల కోసం సైకిళ్లు ఇచ్చి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడు చేసిన పనికి గ్రామస్థులు అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇంటి పైకప్పుపై బస్సు- సీట్లు, టీవీ, లైట్లు సైతం- ఎక్కడో తెలుసా?
సోదరి ఎగ్జామ్ కోసం సాహసం- మంచులో 4కి.మీల 'రోడ్డు' వేసిన సోదరుడు!