ఆ దేవుడికి మద్యంతో అభిషేకం.. సిగరెట్‌తో హారతి! - karnataka news today
Liquor Cigarettes Offered to God: కొబ్బరికాయలు, పండ్లు, పూలు, కర్పూరం.. గుడిలో దేవుడికి నైవేద్యం అంటే గుర్తొచ్చేవి ఇవే. కానీ.. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా కర్వారలోని ఓ ఆలయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ భగవంతుడికి మద్యం సీసా, సిగరెట్ ప్యాకెట్, చికెన్‌ను నైవేద్యంగా సమర్పిస్తున్నారు భక్తులు. మద్యంతో దేవుడికి అభిషేకం చేయడం గమనార్హం. కరావర కప్రీ దేవ జాతర సందర్భంగా ఇలా మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలా చేస్తే తమ కోర్కెలు నెరవేరతాయన్నది వారి నమ్మకం.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST