బైక్‌తో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లిన యువకుడు.. స్టంట్ పేరుతో.. - youth bike stunt in panipat canal
స్టంట్ పేరుతో ఓ యువకుడు వేల రూపాయల బైక్‌ను నీటిపాలు చేశాడు. ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి.. బండితో సహా కాల్వలోకి దూసుకెళ్లాడు. హరియాణా పానీపత్ జిల్లాలోని మాజ్రా గ్రామానికి చెందిన యువకుడు.. దిల్లీ ప్యారెలల్ కెనాల్లోకి ఇలా బైక్‌తో సహా వెళ్లాడు. కొద్దిక్షణాల్లోనే అతడు నీటిలో నుంచి బయటకు వచ్చి.. ఆనందంతో కేరింతలు కొట్టాడు. ఈ తతంగం మొత్తాన్ని అతడి మిత్రులు వీడియో తీశారు. కాసేపటి తర్వాత బైక్‌ను కూడా కాల్వలో నుంచి బయటకు తీశారని తెలిసింది.