తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral video: పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నం.. సెక్యూరిటీ గార్డు పోరాటంతో.. - వైరల్ వీడియో

By

Published : Jul 13, 2022, 11:00 AM IST

పట్టపగలే బ్యాంకును లూటీ చేయాలని విఫలయత్నం చేశారు ముగ్గురు దుండగులు. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మందర్​ సింగ్​ సాహసం చేసి వారిని నిలువరించాడు. ముగ్గురూ అతడిపై దాడి చేస్తున్నా.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన పంజాబ్​లోని మోగ జిల్లా దాదాపుర్​ గ్రామంలోని ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దుండగులతో జరిగిన ఘర్షణలో మందర్​ సింగ్​ గాయపడ్డారు. తనపై కత్తితో దాడి చేశారని పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details