గర్ల్స్ హాస్టల్‌లో వీసీ చిందులు.. వీడియో వైరల్ - తెలంగాణ యూనివర్సిటి
VC Dances womens hostel తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి రవీందర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో గణేష్ నిమజ్జనం అనంతరం గర్ల్స్ హాస్టల్‌లో....ఇద్దరు బయటి వ్యక్తులతో కలిసి నృత్యాలు చేయడం వివాదాస్పదం అయ్యింది. డాన్సులు చేస్తూ... డబ్బులు పంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీసీ ప్రవర్తనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మహిళల వసతిగృహంలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.